శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోర్న్ వీడియోల కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రాజ్ కుంద్రా ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త మరియు బాలీవుడ్ నిర్మాత కావడంతో ఈ వ్యవహారం బాలీవుడ్ ఓ కలకలం రేపుతోంది. అంతే కాకుండా బాలీవుడ్ సంబంధించిన పలువురు ఇందులో ఉన్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక ఈ కేసులో రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు అతనికి రిమాండ్ విధించింది. రాజ్ కుంద్రా వ్యాపారాలను అతడి యూకే బంధువు ప్రదీప్ బక్షి భాగస్వామ్యం తో చేసినట్టు పోలీసులు గుర్తించారు.
ప్రదీప్ భక్షి ప్రొడక్షన్ హౌస్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే వీరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్ లో లావాదేవీలు ఎలా జరిగాయి...పోర్న్ వీడియోలు సృష్టించి డబ్బులు ఎలా సంపాదించాలి అన్న విషయాలు ఉన్నట్టు తేలిందని చెబుతున్నారు. అంతే కాకుండా రాజ్ కుంద్రా పీఏ ఉమేష్ కామత్ ఓ ప్రొడక్షన్ హౌస్ ప్రతినిధిగా పనిచేశారు. ఈ ప్రొడక్షన్ హౌస్ తోనే అశ్లీల చిత్రాల తయారీ సంస్థ ఏజెంట్లతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నట్లు నిర్ధారణ అయింది. దాంతో ముంబై పోలీసులు కీలక కుట్రదారుడిగా ఉమేష్ కామత్ ను గుర్తించారు. ముంబై సీపీ విడుదల చేసిన ఒక ప్రకటనలో లో అశ్లీల చిత్రాలను సృష్టిస్తు వాటిని అప్లోడ్ చేసి డబ్బులు సంపాధిస్తున్న కేసులో రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశామని అన్నారు.
ఫోన్ కాల్స్, వాట్సప్ చాట్ లో కీలక ఆధారాలు ఉన్నాయని దర్యాప్తులో బయటపెడతామని చెప్పారు. మరోవైపు రాజ్ కుంద్రా వాట్సాప్ లో ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులు పాలు పంచుకున్నారని వెల్లడైందన్నారు. ఆ బాలీవుడ్ గలీజ్ లీలలు కడా బయటపెడతామని వెల్లడించారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు కూడా అశ్లీల పనులు చేశారని బాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులతో ఈ వ్యవహారాన్ని విశ్లేషిస్తున్నారు. అది బయటకు వస్తే ఈ పోర్న్ వీడియోల కేసులో ఎవరెవరు ఉన్నారనేది బయట పడుతుంది. దాంతో బాలీవుడ్లోని ప్రముఖుల బండారం బయటపడుతుందని కూడా ప్రచారం జరుగుతోంది.