ఆమె చెప్పింది కరెక్ట్.. అవి పోర్న్ సినిమాలు కావు : గెహన
రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలను నిర్మించడ మే కాదు వాటిని పలు వెబ్సైట్లో అప్లోడ్ చేయడం అంతే కదా హాట్ షాట్స్ ద్వారా ఏకంగా వ్యాపారం చేస్తున్నారని భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు అని ముంబై పోలీసులు ఆరోపిస్తున్నారు అయితే ఇక పోర్న్ సినిమాలు నిర్మించడం లో ఆయన భార్య శిల్పాశెట్టి తో పాటు నటి గెహన వసిస్ట్ ది కూడా కీలక పాత్ర ఉందని పోలీసులు ఆరోపిస్తారు. అయితే శిల్పాశెట్టి మాత్రం తన భర్త శృంగార భరితమైన సినిమాలు నిర్మిస్తున్నారు కాని.. అవి పోర్న్ సినిమాలు కాదు అంటూ చెబుతున్నారు వాటి రెండిటికీ తేడా ఏంటి అన్న విషయాన్ని కూడా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు శిల్పాశెట్టి.
ఇకపోతే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఈ కేసులో కీలక పాత్రధారి అని ఆరోపణలు ఎదుర్కొంటున్న గెహన వశిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల శిల్పాశెట్టి ఇచ్చిన స్టేట్ మెంట్ కు మద్దతు ఇచ్చారు. శిల్పాశెట్టి సరిగ్గా చెప్పిందని హాట్‌షాట్స్ యాప్ లో ఎప్పుడు అశ్లీలత చూపించే విధంగా లేదు అంటూ చెప్పుకొచ్చారు దేశంలో అనుమతి లేని దాంతో ఎవరైనా ఎలా సంబంధం పెట్టుకోవాలని కోరుకుంటారు అంటూ చెప్పుకొచ్చింది. హాట్ షాట్ లో కంటెంట్ గురించి శిల్పాశెట్టికి తెలియదు అంటూ వివరణ చెప్పుకొచ్చింది. హాట్ షాట్ లో ఎప్పుడూ కూడా పోర్న్ ఫిలిమ్ చేయలేదని హాట్ షాట్స్ లో చేసేవి బోల్డ్ ఫిలిమ్స్. శృంగార చిత్రాలు మాత్రమే నని.. వాటిని పోర్న్ సినిమాలుగా చూడవద్దు అంటూ గెహన స్టేట్మెంట్ ఇచ్చింది.