మాస్ రాజా డబుల్ సెంటిమెంట్.. ఈసారి రిజల్ట్ ఎలా ఉంటుందో..!
ఇక మరోసారి దరువు సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ చేశారు. ఆ సినిమాలో కూడా రవితేజ తన డ్యుయల్ పర్ఫార్మెన్స్ తో మెప్పించారు. దరువు సినిమా కూడా అంచనాలను అందుకుందనే చెప్పాలి. ఆ రెండు సినిమాల తర్వాత శ్రీను వైట్ల డైరక్షన్ లో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఏకంగా ట్రిపుల్ రోల్ చేశాడు రవితేజ. అయితే ఆ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఇక మరోసారి రవితేజ ఖిలాడి సినిమాతో ద్విపాత్రాభినయంతో వస్తున్నాడు.
సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది. ఖిలాడిలో రవితేజ డ్యుయల్ రోల్ లో దుమ్ముదులిపేస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ అందిస్తున్న మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. మరి మాస్ రాజా డ్యుయల్ సెంటిమెంట్ ఖిలాడికి వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా తర్వాత శరత్ మండవ డైరక్షన్ లో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. ఆ సినిమా కూడా రవితేజ కెరియర్ లో మాస్ ఎంటర్టైనర్ గా వస్తుంది. రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రవితేజ సబ్ కలెక్టర్ రోల్ లో నటిస్తున్నాడట మాస్ రాజా. ఖిలాడి రిలీజైన వెంటనే ఆ సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టనున్నాడు.