అంకుల్స్ తో కలిసి రచ్చ రచ్చ చేస్తున్న శ్రీముఖి..

Purushottham Vinay
ఇక ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బాగా క్రేజ్ ఉన్న యాంకర్ ఎవరంటే ముందుగా అందరికి గుర్తొచ్చే పేరు శ్రీముఖి. ఇండస్ట్రీలో అందరు కూడా బెస్ట్ లేడీ యాంకర్ ఎవరంటే ఆలోచించకుండా శ్రీముఖి పేరే చెబుతారు. ఇక బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా అప్పుడప్పుడు శ్రీముఖి కనిపిస్తూ బాగా సందడి చేస్తుంటుంది. ఇక శ్రీ ముఖి గతంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ.. ఈమెకు ఊహించినంత గుర్తింపు అయితే రాలేదని చెప్పాలి.ఇక దీంతో బుల్లితెరపై మంచి అద్భుతమైన ప్రదర్శన చేస్తూ.. బెస్ట్ యాంకర్‌గా శ్రీ ముఖి మంచి పేరు సంపాదించుకుంది. ఇక దీంతో ఇప్పుడు పాపులారిటీ వచ్చిన తర్వాత ఈ ముద్దు గుమ్మకు సినిమా అవకాశాలు అనేవి బాగా క్యూకడుతున్నాయి. ఇక తాజాగా ఈ భామ ‘క్రేజీ అంకుల్స్’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.సత్తి బాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, సింగర్ మనో, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


ఇక మంచి ఫ్యామిలీ ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను డైరెక్టర్ రూపొందిస్తున్నారు. అలాగే తాజాగా ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేయడం జరిగింది. ఇక ఈ పాటకు సింగర్ రఘు కుంచే సంగీతం అందించగా.. లిప్సిక అదిరిపోయే గానం చేసింది. అలాగే కాసర్ల శ్యామ్ ఈ పాటకు మంచి సాహిత్యం అందించారు. ఫాస్ట్ బీట్‌తో సాగే ఈ పాటలో శ్రీముఖి తన డ్యాన్స్‌తో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో శ్రీముఖి కాస్త స్పైసీగా ఇంకా హాట్ గా ఉండే పాత్రలో నటిస్తోంది. శ్రీముఖిని పడేయటానికి ప్రయత్నించే ముగ్గురు అంకుల్స్‌గా రాజా రవీంద్ర, సింగర్ మనో, భరణి కనిపించబోతున్నారు. మరి ఈ అందాల ముద్దు గుమ్మని పడేయటానికి ఆ ముగ్గురు అంకుల్స్ చేసే ప్రయత్నాలు ఏంటీ అనేదే ఈ సినిమా ప్రధాన అంశంగా ఉండనుంది. ఇక ఈ చిత్రాన్ని గుడ్ సినిమా బ్యానర్‌పై కిరణ్ కే తలసిల సమర్పణలో బొడ్డు అశోక్ నిర్మిస్తున్నారు. ఇక ఇందులో పోసాని కృష్ణ మురళీ, రఘు, హేమా, గాయత్రి భార్గవి తదితర నటులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: