మల్టీ స్టారర్ గా వచ్చి సెన్సేషనల్ హిట్ కొట్టిన మూవీ..
ఇక సూపర్ స్టార్ కృష్ణ వారసత్వం అందుకని,తండ్రి కంటే ఎక్కువ స్థాయిలో స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు, నాటి నుంచి నేటి వరకు వేరే సినీ ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపకుండా.. తెలుగులో తన సత్తా ఏంటో చూపుతూ, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అంతేకాదు బాలీవుడ్ కి ప్రస్తుత కాలంలో అందరు హీరోలు ఎగబడి వెళ్తుంటే.. మన ప్రిన్స్ మహేష్ బాబు మాత్రం చేస్తే తెలుగు సినిమాలను మాత్రమే చేస్తాను అంటూ భీష్మించుకు కూర్చున్నాడు.ఇక ఆయనకు తెలుగు ప్రేక్షకులపై ఉన్న అభిమానం చెప్పకనే తెలుస్తోంది.
అయితే ఇలాంటి ఇద్దరు స్టార్స్ కలిసి ఒకే వేదికపై, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని మంచి మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో అంజలి, సమంత హీరోయిన్లుగా నటించారు. జయసుధ, ప్రకాష్ రాజ్ లు హీరోలకు తల్లిదండ్రుల పాత్రలో నటించి, అందరిని మెప్పించారు అని, చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ పాత్రకు ముందుగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ను, అనుకున్నారు. కానీ ఆయన ఏదో కారణాలచేత సినిమా కథను ఒప్పుకోలేదు. ఇక ఈ పాత్ర ప్రకాష్ రాజ్ వినగానే ఓకే చెప్పేశారు.
ఇక ఈ సినిమా అటు ఆడియెన్స్ ను , ఇటు యూత్ ను బాగా ఆకట్టుకుంటూ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీగా తెరకెక్కిన చిత్రం ఇది. ఇక ఈ సినిమాలో ఏ ఒక్క పేరును కూడా మనం విని ఉండము. కేవలం అంజలి పేరు మాత్రమే సీత గా పెట్టడం జరిగింది. అసలు పేర్లు ఉపయోగించకుండా, ఆప్యాయతలతో, బంధుత్వంతో పిలుచుకుంటూ ఎంతో గొప్పగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సృష్టించింది.బాక్సాఫీస్ వద్ద మొదట షో తోనే హిట్ టాక్ ను అందుకుని, ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు తీసుకు వచ్చింది ఈ సినిమా.