నటి కాస్ట్లీ డ్రెస్.. దాంతో ఏకంగా బ్రాండ్ న్యూ బైక్ కొనేయొచ్చట...!!

Vimalatha
సెలబ్రిటీలు అన్నాక కాస్ట్లీ యాక్సెసరీస్, అలాగే కాస్ట్లీ డ్రెస్సులు ధరించడం సర్వసాధారణం. కానీ తాజాగా ఓ నటి ధరించిన డ్రెస్ ఖరీదుతో ఏకంగా బ్రాండ్ బైక్ ని కొనవచ్చు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ బ్యూటీ శ్వేతా తివారి ధరించిన చీరపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. శ్వేతా తివారి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ బాలీవుడ్లో మాత్రం బుల్లితెర, వెండితెరపై సెలబ్రిటీ ఇమేజ్ ఆమె సొంతం. ఎన్నో టెలివిజన్ సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటించి భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. తాజాగా ఆమె బుల్లితెర నటీనటులు రాహుల్ వైద్య, దిశా పార్మర్ వివాహ వేడుకకు అతిథిగా విచ్చేసింది. ఈ వేడుకలో శ్వేత పౌడర్ బ్లూ ఫెదర్డ్ శారీ ధరించింది. మ్యాచింగ్ బ్లౌజ్, ఇయర్ రింగ్స్, స్ట్రెయిట్ హెయిర్ తో ఆమె లుక్ అద్భుతంగా ఉంది. ఇటీవల బరువు తగ్గిన శ్వేత ఈ శారీలో అభిమానుల దృష్టిని ఆకర్షించింది. 

ఈ శారీని పూజ పెషోరియా అనే స్టైలిష్ట్ రూపొందించింది. ఈ చీర పై హ్యాండ్ ఎంబ్రాయిడరీ క్రిస్టల్స్, సెక్విన్స్, ద్యాంగ్లింగ్ క్రిస్టల్స్ తో డిజైన్ చేశారు. చీర మొత్తం ఉన్న స్టోన్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఈ చీరలో ఫైన్ సిల్క్, కాటన్, రయాన్ మిక్స్ అయి ఉన్నాయి. కానీ చూడ్డానికి నెట్ శారీలా కనిపిస్తోంది. దీని విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. దీని ప్రైస్ రూ.90,000. ఈ చీర ఖరీదుతో హై ఎండ్ బైక్ రివోల్ట్ ఆర్వి400ను కొనేయొచ్చు. లేదా ఒక ఇల్లు మొత్తానికి ఫర్నిచర్ సమకూర్చవచ్చు. మొత్తానికి పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన శ్వేతా తివారి గత కొంతకాలంగా వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఆమె మాజీ భర్త అభినవ్ కోహ్లీ విషయంలో. తన కుమారుడు రేయాన్ష్ ను తన నుండి శ్వేత వేరు చేస్తున్నారంటూ ఆయన ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: