హీరో వెంకటేష్ ఆ టీడీపీ నేతకు సొంత తోడళ్లుడేనా ?
వెంకటేష్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వెంకటేష్ భార్య మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ కు స్వయానా మేనకోడలు కావటం విశేషం. కామినేని శ్రీనివాస్ అక్క కుమార్తెనే వెంకటేష్ వివాహం చేసుకున్నారు. కామినేని శ్రీనివాస్ బిజెపి నుంచి 2014 ఎన్నికల్లో కైకలూరులో పోటీ చేసినప్పుడు వెంకటేష్ భార్య ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఆమె తన మేనమామను గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇక వెంకటేష్ పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు కు చెందిన ఆంధ్ర సుగర్స్ డైరెక్టర్ పెండ్యాల అచ్చిబాబు కు స్వయానా తోడల్లుడు. వెంకటేష్ భార్య, అచ్చిబాబు భార్య ఇద్దరు అక్కా చెల్లెల్లు కావటం విశేషం. అచ్చిబాబు సోదరుడు పెండ్యాల కృష్ణబాబు టిడిపి నుంచి 5 సార్లు కొవ్వూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం అచ్చిబాబు టిడిపిలో చంద్రబాబుకు అత్యంత ఆప్తుడుగా ఉండడంతో పాటు కొవ్వూరు రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు.