బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. మొబైల్ యాప్స్‌లో అశ్లీల వీడియోలను పెట్టి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలపై కోర్టు ఈ నెల 27 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో తాజాగా శిల్పా-రాజ్ కుంద్రాను వారి ఇంట్లోనే పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవేంటంటే..
ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తన సతీమణి శిల్పాశెట్టికి భారీ మొత్తంలో ఖరీదైన వస్తువులను గిఫ్ట్‌గా ఇచ్చాడు. వాటి విలువ తెలుసుకుంటే మీ మతి పోతుంది. అంతలా విలువైన ఆస్తులు ఉన్నాయి వీరికి. బ్రిటన్ కంట్రీలోని లండన్ సమీపంలో సర్రే ప్రాంతంలో శిల్పా-రాజ్ కుమద్రాకు ‘రాజ్ మహల్’ ఉన్నట్లు సమాచారం. తెలుస్తోంది. యూకేలోని సెయింట్ జార్జ్ హిల్ ఎస్టేట్‌లో ఉన్న ఈ విలువైన విలాసవంతమైన భవనాన్ని తన సతీమణి శిల్పాశెట్టికి రాజ్ కుంద్రా గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే..రాజ్ మహల్‌ను బహుమతిగా ఇచ్చిన సమయంలో రాజ్ కుంద్రా తన మొదటి భార్య కవితకు డైవర్స్ ఇవ్వలేదట. ఈ మేరకు మీడియాలో వార్తల్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ రాజ్ మహల్ ఇంటీరియర్ డిజైనింగ్ మొత్తం శిల్పాశెట్టి దగ్గరుండి చేసుకున్నట్లు.బ్రిటీష్ కట్టడాలైన ‘ఎఫ్’ భవానాన్ని పోలి ఉన్న ఈ రాజ్ మహల్ అద్భుత కట్టడం. పొడవాటి స్తంభాలతో హైలైట్‌గా మెరుస్తూ కనిపిస్తుంది ఈ బిల్డింగ్. ఇది మాత్రమే కాకుండా శిల్పా-రాజ్‌కు ముంబైలోని జుహూ బీచ్ ఏరియాలో మరో ఖరీదైన బిల్డింగ్ ఉంది. ఖరీదైన ఈ రాజ్ మహల్ భవనం వారికి ఎలా వచ్చిందనే చర్చ కూడా సాగుతుండగా, ఫిల్మ్ పర్సనాలిటీస్ వద్ద బోలెడు మనీ ఉంటుందని నెటిజన్లు చెప్తున్నారు. ఈ సంగతులు ఇలా ఉండగా పోలీసుల విచారణ సందర్భంగా మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తుంది.