త్రివిక్రమ్,మహేష్, త్రిష.. 'అతడు' మ్యాజిక్ రిపీట్ కానుందా..?

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ ల కాంబినేషన్ కి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది. మళ్ళీ చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈసారి మళ్ళీ అతడు మ్యాజిక్ ని రిపీట్ చేయాలని అనుకుంటున్నాడట త్రివిక్రమ్.మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మొదటి చిత్రం 'అతడు'.మహేష్ సరసన త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమా థియేటర్లలో యావరేజ్ గా ఆడినా.. టీవీ లో మాత్రం అత్యధిక రేటింగ్ అందుకున్న ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచింది.ఈ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చినా మంచి రేటింగ్స్ ని అందుకుంటుంది.

అంతేకాదు టీవీలో అత్యధిక సార్లు ప్రసారమైన సినిమాగా కూడా 'అతడు' రికార్డ్ సృష్టించింది.త్రివిక్రమ్ సినిమాలను ఎప్పుడు చూసినా అందులో ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది ఆడియన్స్ కి.అందుకే ఆయన సినిమాలు టీవీ ల్లోనూ మంచి ఆదరణను దక్కించుకుంటుంటాయి.అయితే అతడు తర్వాత వీరి కాంబోలో 'ఖలేజా' సినిమా వచ్చింది.కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.టీవీల్లో ఈ సినిమాని ఇష్టపడే సెపరేట్ ఆడియన్స్ ఉన్నారు.ఇక మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత తాజాగా వీరి కాంబోలో సినిమా రానుండటంతో ఇప్పటికీ ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. 

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ను తీసుకునే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు సమాచారం.ఇప్పటికే హీరోయిన్ పాత్ర కోసం చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారు.వారిలో పూజా హెగ్డే, కియారా అద్వానీ,మాళవిక మోహనన్ వంటి హీరోయిన్ల పేరులు ప్రముఖంగా వినిపించాయి.కానీ ఇప్పుడు వాళ్ళందర్ని పక్కనపెట్టి త్రిష వైపు త్రివిక్రమ్ మొగ్గుచూపుతున్నారట అంతేకాదు ఈ సినిమాకి హీరోయిన్ గా త్రిష నే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిందనే టాక్ నడుస్తోంది ఇండ్రస్టీ లో.ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉండగా.. అందులో సెకండ్ హీరోయిన్ గా నివేదా థామస్ ని చిత్ర యూనిట్ తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక త్వరలోనే దీనికి సంబంధించి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: