లాంబర్గిని కార్ లోంచి దిగడానికి టాల్ హీరోయిన్ కష్టాలు...!
ఊర్వశి సినిమాల విషయానికొస్తే... భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రంతో తమిళంలో అడుగుపెట్టనుంది. దీనిలో ఆమె మైక్రోబయాలజిస్ట్, ఐఐటియన్ పాత్రలో నటించనుంది. తరువాత ఆమె నటించిన ద్విభాషా థ్రిల్లర్లో కనిపించబోతోంది. "బ్లాక్ రోజ్"తో పాటు 'తిరుటు పాయలే 2' హిందీ రీమేక్. ఈ నటి ఇటీవల గురు రంద్వా సరసన 'డూబ్ గయే', మొహమ్మద్ రంజాన్ సరసన 'వెర్సేస్ బేబీ' పాటలో ఆమె కన్పించింది. ఈ రెండు సాంగ్స్ కు కూడా బ్లాక్ బస్టర్ స్పందన వచ్చింది. సూపర్ కాప్ అవినాష్ మిశ్రా, పూనమ్ మిశ్రా నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ 'ఇన్స్పెక్టర్ అవినాష్'లో రణదీప్ హుడా సరసన ఊర్వశి కన్పించింది. ఈ వెబ్ సిరీస్ ను జియో స్టూడియో నిర్మిస్తోంది. ఈ హీరోయిన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న "బ్లాక్ రోజ్" గురించి ఇక్కడి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.