హీరోయిన్ను పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ సినీ గేయ రచయిత..!
స్నేహన్ ఇండస్ట్రీలో సినీ రచయితగానూ.. మక్కల్ నీది మయ్యం పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో కమల్ హాసన్ తో కలిసి స్నేహాల్ ప్రచారంలో పాల్గొన్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో విరుగంబాక్కం అసెంబ్లీ స్థానానికి పోటీ కూడా చేశారు. అయితే పోటీ చేసి ఓడిపోయాడు. అయితే హీరోయిన్ కనిక రవితో కొన్నేళ్ల కింద స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త పెళ్లి పీటలకు దారితీసింది. కనిక 8 ఏళ్ల కిందట దేవరాట్టం సినిమాలో నటించారు. ఈ సినిమాకు స్నేహన్ పాటలు రాశాడు. అప్పుడే వీరిద్దరు మధ్య పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలిసింది. దీంతో వారే పెళ్లికి ముహూర్తం పెట్టారు. దీంతో ఈ నెల 29న వడళనిలోని గ్రీన్ పార్క్ హోటల్ లో పెళ్లి చేసుకోనున్నారు. ఉదయం 10.45కి ముహుర్తం ఉంది. ఈ పెళ్లికి కమల్ హాసన్ రానున్నారు. స్నేహన్, కనిక పెళ్లికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరు కానున్నారు. అంగరంగ వైభవంగా వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. స్నేహితులుగా పరిచయమై.. పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈ నూతన దంపతులను అందరూ ఆశీర్వదిద్దాం.