దర్శక ధీరుడు
ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో తో
ప్రభాస్ పాన్
ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఆ తర్వాత కూడా ఈ
హీరో పాన్
ఇండియా సినిమాలు చేయడానికే ఎక్కువగా ఇష్టపడ్డాడు. అందులో భాగంగానే
సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సాహో'
సినిమా తో
బాలీవుడ్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాడు. ప్రస్తుతం
డార్లింగ్ ప్రభాస్ నటించేవి అన్ని కూడా పాన్
ఇండియా సినిమాలే కావడం విశేషం. ప్రస్తుతం ఈ
హీరో రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. దానితో పాటే ఓం రావుత్ దర్శకత్వంలో 'ఆది పురుష్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది ఒక మైథలాజికల్ సినిమా. రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాను 'టి సిరీస్' సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో
ప్రభాస్ కు జంటగా
కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో లో
ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా,
కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో
సైఫ్ అలీ ఖాన్ కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ
సినిమా సగ భాగం కంటే ఎక్కువే షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ రోజు
ఆది పురుష సినిమాలో
హీరోయిన్ అయిన కృతిసనన్ పుట్టినరోజు సందర్భంగా
ప్రభాస్ తన సోషల్
మీడియా అకౌంట్ ద్వారా తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సినిమాలతో పాటు
ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో కూడా ఒక సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన
పూజా కార్యక్రమాలు కూడా ఈ మధ్యనే పూర్తి అయ్యాయి. ఈ సినిమాలో
అమితాబ్ బచ్చన్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను
ప్రభాస్ స్వయంగా క్లాప్ కొట్టి ప్రారంభించాడు. ఈ సినిమాను కూడా పాన్
ఇండియా రేంజ్ లోనే నిర్మిస్తున్నారు.