మళ్ళీ వారిద్దరూ కలుస్తున్నారు ?

VAMSI
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య వరుస వెబ్ సిరీస్ లతో తన జోరు చూపిస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ ‘లెవన్త్ అవర్’, మరియు ‘నవంబర్ స్టోరీ’ అనే రెండు ప్రముఖ వెబ్‌ సీరీస్‌లలో నటించి మంచి మార్కులే రాబట్టింది. అంతే కాకుండా తాజాగా మరో రొమాంటిక్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న వెబ్ సిరీస్ లో నటించేందుకు సైన్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు తాజాగా మరో వార్త సంచలనంగా మారింది. తమిళ్ తో పాటు తెలుగు మరియు పలు భాషల్లోనూ స్టార్ డం  తెచ్చుకున్న టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతితో తమన్నా ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం మొదలయ్యింది. వీరి మధ్య ముందుగానే మంచి ఫ్రెండ్షిప్ ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు వీరిద్దరూ కలసి తెలుగులో హీరోహీరోయిన్లుగా నటించింది లేదు.
కాబట్టి తొలిసారిగా వీరి కాంబో తెరపై కనపడబోతోంది అంటూ వార్తలు వినపడుతున్నాయి. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా సినిమా రాబోతుంది అంటే ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అంతగా విజయ్ సేతుపతిని ఆరాధిస్తారు ప్రేక్షకులు. హీరో గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా ఇలా అన్ని యాంగిల్స్ లో కనిపిస్తూ తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించడంలో ఎప్పుడూ ముందుంటారు విజయ్ సేతుపతి. ఇటు తమన్నా కూడా అభినయంతో కలిపిన 100% గ్లామర్ బార్బీ గర్ల్..సో వీరి కాంబో వేరే లెవల్ అని చెప్పవచ్చు.
ఇక ఇటీవలే మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం ప్రమోషన్ యాడ్ లో  వీరిద్దరూ కలసి నటించిన విషయం తెలిసిందే. దీనికి భారీగా స్పందన లభించిన నేపథ్యంలో ఇప్పుడు వీరి సినిమా ఉండబోతోందన్న వార్త అందరికీ ఆనందాన్నిస్తోంది. మరి ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి తమన్నా చేతిలో సిటీమార్, గుర్తుందా శీతాకాలం,  F3 సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ తనకు మంచి పేరు తీసుకువచ్చి మళ్ళీ టాలీవుడ్ లో నెంబర్ హీరోయిన్ గా నిలబెడతాయా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: