మలయాళ ఇండస్ట్రీలో ప్రముఖ జంట అయినా ముఖేశ్, మెతిల్
దేవిక లు విడాకులు తీసుకోనున్నారు. వీరి ఎనిమిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలక పోతున్నట్లు డాన్సర్
దేవిక మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ సందర్భంగా
దేవిక మీడియా వారితో మాట్లాడుతూ
ముఖేష్ వ్యక్తిగా మంచివాడే కానీ మంచి
భర్త కాలేకపోయాడు అని చెప్పింది. మా వివాహమై ఎనిమిది సంవత్సరాలు అవుతున్న అతడిని ఇంకా నేను పూర్తిగా అర్థం చేసుకోలేక పోతున్నాను అని తెలిపింది. అందుకే అతడి తో విడాకులు తీసుకోవడానికి సిద్ధమైనట్లు ఆమె తెలిపింది. వ్యక్తిగత కారణాల వల్ల నేను నా
భర్త ముఖేష్ తో విడాకుల కోసం దరఖాస్తు చేశాను. ఈ విషయంలో నా
భర్త అభిప్రాయం ఏంటో నాకు తెలియదు అని , ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుండి చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాను అని, దయచేసి దీనిని పెద్ద రాద్ధాంతం చేయకండి. నేను నా
భర్త పరువు తీయాలనుకోవడం లేదు. నటుడిగా రాజకీయ నాయకుడిగా అతడి వ్యక్తిగత విషయాలను ప్రస్తావించాల్సిన అవసరం నాకు లేదు.
అతడి మీద వస్తున్న రాజకీయ ఆరోపణల గురించి స్పందించే అంత ఆసక్తి ,అవసరం నాకు ఏ మాత్రం లేదు. ముకేశ్ మీద గృహ హింస ఆరోపణలు కూడా చేయడం లేదు. అలా అని నేను అతనితో కోపంతోనో, ఆవేశం లోనూ విడిపోవడం లేదు అని వివరించింది. అయితే ఈ విడాకులకు సంబంధించి ఎలాంటి లీగల్ నోటీసులు తనకు అందలేదని
ముఖేష్ పేర్కొన్నాడు. కాగా నటుడు నాయకుడు అయిన
ముఖేష్ గతంలో నటి
సరిత తో వివాహమైంది. అయితే
ముఖేష్ తాగుబోతు అని, పలువురు మహిళలతో అక్రమ సంబంధం ఉంది అని ఆరోపణలతో 2011లో భర్తతో విడాకులు తీసుకుంది. ఈ విడాకుల తర్వాత 2013లో
ముఖేష్ డాన్సర్
దేవిక ను రెండో
పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్లపాటు చాలా అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు డాన్సర్
దేవిక ద్వారా తెలుస్తుంది.