ప్రస్థానాన్ని 'మహాసముద్రం' ఆ విషయంలో దాటగలదా ?
'ఫీల్ ది ఇంటెన్సిటీ` అంటూ రిలీజ్ చేసిన మహా విజువల్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ విజువల్స్ చూస్తుంటే 'ఆర్ఎక్స్100' ను మించిన లవ్ స్టోరీ, అలాగే ప్రస్థానం మూవీకి తగ్గ ఫుల్ ఎమోషన్స్ ఉన్నాయనిపిస్తుంది. అయితే, ట్రైలర్ కానీ లేదా టీజర్ కానీ వస్తే ఈ మహాసముద్రంలోని ఎత్తు పల్లాలు ఏమిటో అన్న విషయంపై ఓ క్లారిటీకి రావచ్చు అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే అతి త్వరలోనే ఈ మూవీ టీజర్ రాబోతుంది అంటూ వినికిడి. మొదట హీరో హీరోయిన్ ల ఫస్ట్ లుక్ ను రివీల్ చేసిన చిత్ర యూనిట్, ఆ తర్వాత కేజీఎఫ్ ఫేమ్ గరుడ రామ్ ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేసి అందర్నీ అట్రాక్ట్ చేసింది. మరి ఇప్పుడేమో ఈ విజువల్.
ఇలా ఒక్కొక్కటిగా ప్లాన్ చేసుకుని రిలీజ్ చేస్తూ ఈ సినిమాపై హైప్ పెంచుతోంది 'మహా సముద్రం' చిత్రబృందం. అయితే ఇందులో ఎంతో లోతైన ఎమోషన్స్ఈ ప్రేక్షకులను కట్టి పడేస్తాయని తెలుస్తోంది. కట్టా దేవా తెరెకెక్కించిన ప్రస్థానం మూవీ లో ఎలాగయితే ఎమోషన్స్ ఉన్నాయో, అంతకు మించిన స్థాయిలో ఎమోషన్స్ ఉన్నాయని చిత్ర బృందం అంటోంది. ప్రస్థానం లో ఎమోషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దానికి మించి అంటే ఇక వేరే చెప్పక్కర్లేదు. మరి ప్రస్థానానికి మించి మహాసముద్రం ఆకట్టుకుంటుందా చూడాలి. ఈ సినిమాలో అదితి రావు హైదరీ మరియు అనూ ఇమ్మానుయేల్ లు హీరోయిన్స్ గా చేశారు.