రజనీకాంత్ నటించిన తొలి హాలీవుడ్ చిత్రం..!

VUYYURU SUBHASH
రజినీ కాంత్.. సినీ ఇండస్ట్రీలో ఈయన గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈయన సినిమా వస్తోందంటే చాలు.. ఏకంగా ఫ్లెక్సీలకే కోట్లల్లో ఖర్చవుతుంది. అంతేకాదు ఇటీవల వచ్చిన ఒక  సినిమా కైతే ఏకంగా విమానాల పైనే సినిమా పోస్టర్లను అతికించడం విశేషం. ఇంతటి మంచి పొజిషన్ ను అందుకున్న రజనీకాంత్ హాలీవుడ్ చిత్రంలో నటించాడని ఎవరికైనా తెలుసా..? అంతేకాకుండా తన చేసిన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం మరో విశేషం. ఇంతకు ఆ హాలీవుడ్ చిత్రం ఏమిటి ..? ఆ సినిమా కథ ఏమిటి..? అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఆ సినిమా ఏదో కాదు బ్లడ్ స్టోన్.. అయితే ఈ సినిమాను నిర్మించింది..ఎవరో కాదు ప్రముఖ భారతీయ నిర్మాత అశోక్ అమృతరాజ్. 1988వ సంవత్సరంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు డైరెక్టర్ గా డ్వైట్ హెచ్ లిటిల్ పని చేశారు. హాలీవుడ్ చిత్రాల అంటే కేవలం హాలీవుడ్ నటులకు మాత్రమే  ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు . కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక సౌత్ హీరోకు హాలీవుడ్ లో కీలకమైన పాత్ర ఇవ్వడం గమనార్హం. అంతేకాదు ఈ విషయం అప్పట్లో ఒక సంచలన వార్తగా మిగిలింది. ఇక ఈ సినిమా కూడా ముఖ్యంగా బెంగళూరు, మైసూర్ వంటి ప్రాంతాల్లో జరుపుకోవడం విశేషం.

అయితే ఈ సినిమా కథ ప్రకారం  బ్లడ్ స్టోన్ అనే ఒక వజ్రం విదేశాల నుండి మన భారతదేశానికి వస్తుంది. ఇక దీనిని తన స్నేహితుడితో కలిసి రజనీకాంత్ ఎలా కాపాడాడు అనేదే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో తన పాత్రకు రజనీకాంత్ స్వయంగా డబ్బింగ్ చెబుతున్నారు. ఇక 1988 అక్టోబర్ 7వ తేదీన మొత్తం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం , అప్పట్లో పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు. మన భారతదేశంలో మాత్రం పర్వాలేదు అనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: