వెబ్ సిరీస్‌లో ఎంట్రీ ఇవ్వనున్న తమిళ స్టార్...?

Suma Kallamadi
కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్స్ ముప్పు నుంచి తప్పించుకున్నామని అనుకునే లోపే మళ్లీ థర్డ్ వేవ్ ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇండ్లలోనే ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ సినిమా రంగంపైన తీవ్ర ప్రభావాన్ని చూపింది. సినిమా థియేటర్లు ఎక్కడికక్కడ క్లోజ్ అయ్యాయి. దాంతో ప్రత్యామ్నాయంగా జనం ఓటీటీ బాటలో కొంత మేర వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఇక ఎలాగూ టాకీసులు లేవు కాబట్టి ఓటీటీల్లోనైనా వినోదం పొందొచ్చు కదా అనే భావన ప్రేక్షకుల్లో కలిగింది.
ఈ క్రమంలోనే సినీ ప్రముఖులు సైతం డిజిటల్ బాట పట్టారు. అనగా వెబ్ సిరీస్, డైరెకట్ ఓటీటీ రిలీజ్ ప్రాజెక్టులకు ఓకే చెప్పారు. అలా విడుదలైన సినిమాలు సక్సెస్ కూడా అయ్యాయి. తమిళ్, తెలుగులో విడుదలైన ఇళయ దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన ‘మాస్టర్’ సినిమా సూపర్ సక్సెస్ అయింది. స్టార్ హీరోలు సైతం ఓటీటీల కోసం సెపరేట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళ్ స్టార్ హీరో ఆర్య కూడా ఒక వెబ్ సిరీస్‌లో నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కానుందట.
అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే చాన్స్ ఉంది. ఆర్య నటించిన పలు చిత్రాలు ఇప్పటికే ఓటీటీల్లో విడుదలై సందడి చేస్తున్నాయి. ‘టెడ్డీ, సార్పట్ట పరంబరై’ చిత్రాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజెసే. ‘కబాలి, కాలా’ ఫేమ్ డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సార్పట్ట’ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు రావడం విశేషం. ఆర్య ప్రస్తుతం ‘అరన్‌మనయి‌3, ఎనిమి’ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘ఎనిమి’ చిత్రం లో ఆర్య, విశాల్ కాంబో ఉండబోతుండగా, ఈ సినిమాపై ఫుల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: