అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ 'ఈనాడు' సినిమాలో ఒక పాటలో తలుక్కున మెరిసిన ఈ భామ. ఆ తర్వాత తెలుగు ,తమిళ భాషల్లో చాలా సినిమాల్లో నటించింది కెరియర్ మొదట్లో పెద్దగా విజయాలు ఈ హాట్ బ్యూటీని వరించలేదు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'గబ్బర్ సింగ్' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ముద్దుగుమ్మకు తెలుగులో వరుసగా ఆఫర్లు దక్కాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలా తెలుగు లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ ఆ తర్వాత మాత్రం ఈ హాట్ బ్యూటీ కెరీర్ పరంగా కొంచెం స్లో అయిందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే శృతిహాసన్ తన డైలీ ఆక్టివిటీస్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులకు తెలియజేస్తూ ఉంటుంది.
శృతిహాసన్ ప్రస్తుతం శాంతను హజారికా అనే పెయింటింగ్ ఆర్టిస్టు తో లవ్ కొనసాగిస్తుంది. చాలా టాలెంటెడ్ అయినా ఇతను ఒక బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం తను ముంబై లో ఉంటున్నాడు. శృతిహాసన్ కూడా ఇతనితో కలిసి ముంబైలోనే ఉంటున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. సంవత్సర కాలం నుండి వీరిద్దరు ప్రేమ లో ఉన్న. గత కొంత కాలం నుంచి అతడితో రచ్చ చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా శృతిహాసన్ ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో లో శృతిహాసన్ ఏకంగా గాల్లో ఎగురుతూ తన ప్రియుడు శాంతను హజారికా మీద ఎక్కేసింది. దీంతో అతడు షాక్ అయ్యాడు. ఈ వీడియోకు భయంతో కూడిన అతని ముఖం చూడండి అంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ప్రస్తుతం శృతి హాసన్ 'సలార్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.