యాంకర్ రష్మి గౌతమ్... గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఎందుకంటే.. ఈటీవీ ఛానల్ లో వచ్చే.. జబర్ధస్త్ షో తో యాంకర్ రష్మి గౌతమ్‌కి మంచి ఫేమ్ వచ్చింది. అంతేకాదు.. సుడిగాలి సుధీర్ తో యాంకర్ రష్మి గౌతమ్ ప్రేమాయణం నడుస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడంతో మరింత క్రేజ్ వచ్చింది. దీంతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది యాంకర్ రష్మి గౌతమ్. మొదట్లో హీరోయిన్ సైడ్ క్యారెక్టర్లు చేసినప్పటికీ.... యాంకర్ రష్మి గౌతమ్‌కి మంచి గుర్తుంపు రాలేదు.
కానీ ఒక్క జబర్ధస్త్ షో తో.... తెలుగు ప్రేక్షకుల్లో తనదైన స్థానాన్ని నిలుపుకుంది. ఇక ఇది ఇలా ఉండగా.. యాంకర్ రష్మి గౌతమ్‌కి... మూగ జంతువులంటే చాలా ఇష్టం..మరీ చెప్పాలంటే ప్రాణం. ఎన్నో సార్లు మూగ జంతువులతో ఫోటోలు దిగి... యాంకర్ రష్మి... తన సోషల్ మీడియాలో షేర్ కూడా చేసింది. మొదట్లో గోవధపై తీవ్రంగా స్పందించింది యాంకర్ రష్మి. అయితే... తాజాగా యాంకర్ రష్మి గౌతమ్.. తెలంగాణ యంగ్ డైనమిక్ లీడర్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సహాయాన్ని కోరింది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో కుక్కలకు చేసే యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపేరేషన్ ప్రక్రియ పై మంత్రి కేటీఆర్ సహాయాన్ని కోరింది యాంకర్ రష్మి. హైదరాబాద్ లో ఉన్న కుక్కలకు యానిమల్ బర్త్ కంట్రోల్ చేసి.. అలాగే వదిలేస్తున్నారని పేర్కొన్న ఆమె.. దీనికి సరైన పరిష్కారాన్ని కనుగోనాలని కేటీఆర్‌ను కోరింది రష్మి. ఈ నేపథ్యంలోనే తన ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు కార్యాలయం మరికు ఆయన పర్సనల్ ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసేసింది ఈ జబర్ధస్త్ బ్యూటీ. అటు రష్మి ట్వీట్ కు నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు. జంతువుల పట్ల ఆమెకు ఉన్న గొప్ప ప్రేమను కొనియాడుతున్నారు నెటిజన్లు. అయితే... ఈ బ్యూటీ బాధను మంత్రి కేటీఆర్ వింటారో ? లేదో ? చూడాలి.