పోర్నోగ్రఫీ కేసులో ఆ హీరోయిన్ పేరు..!

NAGARJUNA NAKKA
రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసు ఒక్క శిల్పాశెట్టినే కాదు బాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్స్‌ని భయపెడుతోంది. శిల్పా ఇప్పటికే నాకేం సంబంధం లేదు, నా ఇమేజ్ డ్యామేజ్‌ చెయొద్దు అని స్టేట్ మెంట్స్ ఇస్తోంటే... మిగతా హీరోయిన్లు కూడా ఇలాగే భయపడుతున్నారు. తమను ఈ కేసులోకి లాగొద్దని వేడుకుంటున్నారు.

రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి శిల్పాశెట్టి బయటకు రావడం లేదు. భర్త చేసే బిజినెస్ గురించి తనకు తెలియదనీ.. ఆయన బోల్డ్‌ వెబ్‌ సీరీసులు తీసుంటాడు గానీ, పోర్న్ మూవీస్ తీయలేదు అని పోలీసుల ముందు చాలా బాధపడిపోయింది శిల్ప. అయితే ఈ మాజీ హీరోయిన్‌ ఎంత గట్టిగా చెప్పినా, కన్నీళ్లు పెట్టుకున్నా ఇంటరాగేషన్‌ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది.

రాజ్‌కుంద్రా కేసులో షెర్లీన్‌ చోప్రాకి నోటీసులు పంపించింది ముంబయి క్రైమ్‌ బ్రాంచ్. ఇక విచారణకి హాజరుకావాలని నోటీసులు వచ్చాయో లేదో, షెర్లీన్ చోప్రా ముందస్తు బెయిల్‌కి దరఖాస్తు చేసుకుంది. పోర్నోగ్రఫీ కేసుతో తనకేం సబంధం లేదనీ... రాజ్‌కుంద్రాతో ఇలాంటి డీల్‌ ఏం లేదని వివరణ ఇచ్చింది.

రాజ్‌కుంద్రా కేసులో సెలీనా జైట్లీ పేరు కూడా వినిపిస్తోంది. వీడియోస్ కోసం సెలీనాని సంప్రదించారనే ప్రచారం జరుగుతోంది. దీంతో సెలీనా డ్యామేజ్‌ కంట్రోల్‌ చర్యలు మొదలుపెట్టింది. శిల్పా శెట్టి నాకు మంచి ఫ్రెండ్‌. ఆమె ఒక సంప్రదాయబద్ధమైన యాప్‌ కోసం నన్ను కాంటాక్ట్ చేసింది గానీ, రాజ్‌కుంద్రా అడల్ట్‌ కంటెంట్‌ కోసం కాదని స్టేట్ మెంట్స్ ఇస్తోంది. హీరోయిన్స్‌ని ఇంతలా భయపెడుతోన్న రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో మున్ముందు ఎవరెవరి పేర్లు వినిపిస్తాయో అని బాలీవుడ్‌ జనాలు కూడా టెన్షన్‌ పడుతున్నారు. మరోవైపు రాజ్ కుంద్రాపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పోలీసులు. చాలా తెలివిగా కూపీ లాగుతున్నారు. దీంతో బాలీవుడ్ నటుల్లో టెన్షన్ మొదలైంది..ఆ కేసులో రాజ్ కుంద్రా తమ పేర్లు ఎక్కడ బయటపెడతాడోనని తెగ భయపడిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: