అక్కినేని కోడలు ఏ మాయ చేస్తుందో..!
ఒక్కొక్కళ్లకి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. సినిమా లాంచింగ్ నుంచి మొదలుపెడితే విడుదల వరకు ఒక్కో దర్శకుడు ఒక్కో సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటాడు. ప్రభాస్ సినిమాకి కూడా నాగ్ అశ్విన్ ఇలాగే ఓ సెంటిమెంట్‌ని కంటిన్యూ చేస్తున్నాడు. 'మహానటి' ఫార్ములాతో 'ప్రాజెక్ట్ కె' బజ్‌ని మరింత పెంచుతున్నాడు నాగ అశ్విన్.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించినా.. నిర్మాతగా పనిచేసినా ఆ సినిమాల్లో విజయ్ దేవరకొండ చాలా కామన్‌గా కనిపిస్తాడు. నాగీ డైరెక్ట్ చేసిన 'ఎవడే సుబ్రమణ్యం, మహానటి'లో సపోర్టింగ్ రోల్ చేసిన విజయ్, నాగీ నిర్మించిన 'జాతిరత్నాలు'లో గెస్ట్ రోల్ ప్లే చేశాడు. అయితే 'మహానటి' నుంచి సమంతని కూడా సెంటిమెంట్‌గా ఫీలవుతున్నాడట నాగ అశ్విన్. అందుకే ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె'కి సమంతని తీసుకొస్తున్నాడట నాగ అశ్విన్.
ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె'ని వరల్డ్ క్లాస్ పిక్చర్‌గా రెడీ చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇప్పటికే దీపిక పదుకొణే, అమితాబ్ బచ్చన్‌ని తీసుకొచ్చి సినిమాపై అంచనాలు పెంచాడు. పాన్ ఇండియన్ మూవీగా మార్చాడు. ఇక ఈ సినిమాలో సమంత కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. 'మహానటి'లో సపోర్టింగ్ రోల్ చేసినట్లే, ప్రాజెక్ట్ కెలో కథను మలుపుతిప్పే పాత్ర చేస్తోందట. చూద్దాం.. నాగఅశ్విన్ సినిమాలో సమంత ఏ మాయ చేస్తుందో.
'ప్రాజెక్ట్ కె' సినిమాలో మళయాళీ స్టార్ పృథ్వీరాజ్ కూడా నటిస్తాడని చెప్తున్నారు. కేరళ మార్కెట్ కోసం ఈ స్టార్‌తో ఒక సపోర్టింగ్ రోల్ చేయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో స్టార్ కాస్టింగ్‌తోనే ఇంత భారీగా కనిపిస్తోన్న ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అని ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.