బాలయ్యకు షాకుల మీద షాకులు... ?

Satya
బాలక్రిష్ణ టాలీవుడ్ లో సీనియర్ స్టార్. ఆయన ఎవరినీ తనకు పోటీ అనుకోరు. తన పని తాను చేసుకుని ముందుకు పోతారు. ఆయన స్టైలే వేరు అన్నట్లుగా ఉంటారు. బాలయ్య తన సినిమాల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు తప్ప అవతల వారి సినిమాలు ఏంటి అన్నది కూడా పెద్దగా పట్టించుకోరు.
అలాంటి బాలయ్యకు ఇపుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అవేంటి అంటే ఆయన బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ సినిమాలకు అనుకుంటున్న టైటిల్స్ ఇపుడు వేరే సినిమాలకు పెడుతున్నారని టాక్. దాంతో బాలయ్య సంగతేమో కానీ ఫ్యాన్స్ మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. ఇంతకీ ఏమా టైటిల్స్  కధ అంటే బాలయ్య బోయపాటి మూవీ తరువాత క్రాక్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన గోపీచంద్ మలినేనితో సినిమా చేయబోతున్నారు. ఈ మూవీకి బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ మూవీకి అనుకుని వదిలేసిన గాడ్ ఫాదర్ ని ఫిక్స్ చేయాలని అనుకున్నారుట. అఖండ తరువాత సెట్స్ మీద వెళ్ళే చిత్రమిది.
అయితే ఈ టైటిల్ ని ఇపుడు మెగాస్టార్ రీమేక్ చేయబోతున్న లూసీఫర్ మూవీకి పెడుతున్నారని టాక్. దాంతో బాలయ్య టైటిల్ మెగాస్టార్ మూవీకా అంటూ ప్రచారం సాగుతోంది. మరో వైపు చూస్తే బాలయ్య అనిల్ రావిపూడి కలసి ఎపుడు సినిమా చేసినా దానికి టైటిల్ ఇదే అని విపరీతమైన ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. అందేంటి అంటే రామారావుగారు. ఈ టైటిల్ బాలయ్యకు యాప్ట్ గా ఉండడమే కాదు, పవర్ ఫుల్ గా ఉంటుంది. అయితే ఈ టైటిల్ ని ఇపుడు మాస్ మహరాజా రవితేజా వాడేసుకుంటున్నారు. రామారావు  ఆన్ డ్యూటీ అంటూ ఈ మధ్యనే రవితేజా  కొత్త సినిమాకు టైటిల్ ని అనౌన్స్ చేశారు. దాంతో బాలయ్యకు పెర్ఫెక్ట్ గా సూట్ అవుతాయనుకున్న రెండు టైటిల్స్ అలా మిస్ అయినట్లే అన్న చర్చ సాగుతోంది. మరి కొత్త సినిమాలకు బాలయ్య ఏ టైటిల్స్ పెడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: