'సిన్నప్ప' కు మరో ఛాలెంజింగ్ పాత్ర... ?

VAMSI
తమిళంలో సూపర్ హిట్ అందుకొని రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు కురిపించిన ధనుష్ అసురన్ మూవీ నారప్ప గా తెలుగులో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక్కడ మన నేటివిటీకి తగ్గట్టుగా కథలో కాస్త మార్పు చేర్పులు చేసి సిద్ధం చేశారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ , ప్రియమణి ప్రధాన పాత్రల్లో తాజాగా ఓటిటి వేదికగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులతో భళా అనిపించుకుంటూ  రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ సినిమాలో వెంకీ, ప్రియమణి పాత్రలతో పాటు వీరి కొడుకుగా నటించిన రాఖీ (చిన్నప్ప) నటనకు మంచి మార్కులు పడ్డాయి. 


ఈ సినిమాలో అందరూ నటుల కన్నా రాఖీ పైనే ఎక్కువ ఒత్తిడి ఉండేదట. అందరూ రాఖీని నువ్వు డైలాగులు బాగా చెప్పాలి, యాక్షన్ బాగా చెయ్యాలి ఇలా ఎదోటి చెబుతూ తీవ్ర ఒత్తిడికి గురి చేసేవారని సక్సెస్ మీట్ లో ప్రియమణి చెప్పిన విషయం తెలిసిందే. రాఖీ పడిన కష్టానికి ప్రతిఫలం ఆ సినిమాలో కనిపించింది. నారప్ప సినిమాలో చిన్నప్ప పాత్ర చాలా బాగా ఎలివేట్ అయింది. ఈ సినిమా చూసిన వారంతా చిన్నప్ప పాత్రను తెగ పొగుడుతున్నారు. చిన్న వయసులోనే ఎంతో ప్రతిభను ప్రదర్శించాడనీ తన సహజమైన నటనతో సినిమాకు మరింత ప్లస్ గా నిలిచాడు. అయితే ఈ కుర్రాడికి ప్రస్తుతం ఓ స్టార్ హీరో చిత్రంలో నటించే అవకాశం లభించిందని సమాచారం.


అది కూడా ఆ సినిమాకు ఎంతో కీలకమైన పాత్ర అని అంటున్నారు. అది కూడా హీరో చిన్నప్పుడు పాత్ర అని తెలుస్తోంది. అయితే ఈ సినిమా నారప్ప లాగా చాలా ఛాలెంజింగ్ పాత్ర అని తెలుస్తోంది. ఇలా నారప్ప సినిమాలో నటించిన అందరికీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ ఆఫర్లను వీరు సరిగ్గా వాడుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: