లెజెండ్రీ జోడి ఓడిపోవడానికి కారణం..

Divya
సినీ ఇండస్ట్రీలోకి నాటి నుంచి నేటి వరకు ఎన్నో జోడీలు వచ్చి , ప్రేక్షకులను అలరించాయి. ఇక సినిమాలలో ముఖ్యంగా ఈ జోడీలు తప్ప మరి వేరే జోడి వచ్చినా ప్రేక్షకులు ఊహించుకోలేరు అన్నట్టుగా కొన్ని జోడీలు ముద్ర వేసుకున్నాయి.. ముఖ్యంగా మన సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని జోడి లకు ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది . ఆ జోడి రాగానే అభిమానులలో ఏదో తెలియని ఆనందం పుట్టుకొస్తుంది. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమిటంటే, హీరో దర్శకుడు లేదా హీరో హీరోయిన్ కాంబినేషన్ లో ఏవైనా సినిమాలు వచ్చాయంటే, తప్పకుండా బ్లాక్ బాస్టర్ హిట్ కొడతాననే నమ్మకం కొంత మంది అభిమానులకు వుంటుంది.

అందులో భాగంగానే  1990 సంవత్సరం తర్వాత అత్యంత గుర్తింపు పొందిన జోడి చిరంజీవి -  శ్రీదేవి.
వీరిద్దరి కాంబినేషన్ లో ఏదైనా సినిమా వచ్చిందంటే చాలు, తప్పకుండా కాసుల వర్షం కురిపిస్తుంది అనే నమ్మకం అభిమానులలో ఉండేది. ఇక అలా వీరిద్దరి కాంబినేషన్లో రాణికాసుల రంగమ్మ, మోసగాడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఎస్పి పరశురాం వంటి చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి. ఇకపోతే ఎస్పి పరశురాం సినిమా మాత్రమే బోల్తాపడింది. ఇక మిగతా సినిమాలన్నీ కాసుల వర్షం కురిపించాయి.
 అలా 1994వ సంవత్సరం జూన్ 15వ తేదీన చిరంజీవి హీరోగా ,శ్రీదేవి హీరోయిన్ గా ,  విడుదలైన చిత్రం ఎస్పి పరశురాం.  అప్పటివరకు మంచి సక్సెస్ ను  అందుకున్న ఈ జోడీ పై అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాదు ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమాను విడుదల చేయడం జరిగింది. కానీ అప్పటివరకు మంచి సక్సెస్ ను  అందుకున్న ఈ జోడీ పై అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాదు ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమాను విడుదల చేయడం జరిగింది. కానీ ఈ సినిమా మాత్రం కూడా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక పోయింది ఫలితం పరాజయం పొందింది.
ఇందుకు కారణం చిరంజీవి రెండు మూడు, సార్లు పోలీస్ గెటప్ లో నటించడంతో, ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించే లేకపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: