కరోనా నేపథ్యంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఒక్కసారిగా సంక్షోభంలోకి వెళ్ళగా మళ్ళీ సినిమా ధియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఎప్పుడూ తమ సినిమాలను రిలీజ్ చేసుకోవాలని ఆర్థిక భారంతో సతమతమవుతున్న నిర్మాతలు మొన్నటిదాకా ఆలోచించారు. అయితే వీరిలో కొంత మంది నిర్మాతలు ధైర్యం చేసి సినిమా థియేటర్ కు ప్రేక్షకులు వస్తారా రారా అన్న సందేహంతో సినిమాలను విడుదల చేశారు. ఆ విధంగా సత్యదేవ్ హీరోగా నటించిన తిమ్మరుసు, తేజ సజ్జ హీరోగా నటించిన ఇష్క్ సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి.
ఈ సినిమాలు టాలీవుడ్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేకున్నా వీటి కలెక్షన్లు టాలీవుడ్ కథ ను మళ్లీ మొదటికి వచ్చేలా చేశాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. శుక్రవారం విడుదలైన ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న కూడా మంచి పేరు సంపాదించుకున్న కూడా రెండు రోజుల్లోనే కలెక్షన్ విషయంలో చాలా డల్ అయిపోయాయి. దీనికి ప్రధాన కారణం థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడమే. క్రేజ్ బాగా లేకున్నా ఈ ఇద్దరు హీరోలు సినిమాలు చూడదగినవే అయినా ప్రేక్షకులు థియేటర్లకు మాత్రం రాలేదు.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ భవిష్యత్తు రాబోయే మరి కొన్ని సినిమాల పై ఆధారపడి ఉంది. ఇప్పటికే సంక్రాంతికి పెద్ద సినిమాలు అన్ని విడుదల అవుతున్నాయని ప్రకటించగా ఇప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమ ను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు కొన్ని పెద్ద సినిమాల విడుదల అవసరం ఎంతైనా ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, బాలకృష్ణ అఖండ, అల్లు అర్జున్ పుష్ప, రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలు దసర సమయంలోనే విడుదల కానున్నాయి. భారీ బడ్జెట్ లతో భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమా లపై ఇప్పటికే మంచి అంచనాలు ఉండగా ఇప్పుడు మళ్ళీ వీటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సినిమాలతో టాలీవుడ్ పూర్వవైభవం తెచ్చుకుంతుందా చూడాలి.