ట్రెండ్ సెట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ దోస్తీ సాంగ్..?

Suma Kallamadi
ఇండియా చలన చిత్ర పరిశ్రమలలో రాజమౌళికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. మగదీర సినిమాతో పాన్ ఇండియా సినిమాలు చేయడం మొదలైనప్పటి నుంచి జక్కన్న వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తూ సాగుతున్నారు. ఆయన సినిమాలు సంవత్సరాల తరబడి తీసినప్పటికీ చివరగా ఓ అద్బతమైన అవుట్ పుట్ బయటకు వస్తుంది. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఓ అద్బుతమైన పాటను ప్రేక్షకులకు అందించాడు. ఆ పాట కు గొప్ప స్పందన అనేది వచ్చింది.
సాంగ్ రిలీజ్ అయిన ప్రతి లాంగ్వేజ్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన అన్ని భాషల్లో ఆర్ఆర్ఆర్ దోస్తీ పాట ట్రెండ్డింగ్ అయ్యింది. ఈ పాటకు తెలుగు వెర్షన్ లో హేమ చంద్ర పాడాడు. తమిళ వెర్షన్ ను అనిరుథ్ అందించాడు. మళయాలంలో విజయ్ ఏసుదాసు పాడారు.ఈ పాట రిలీజ్ అయిన ప్రతి భాషలోనూ అందర్నీ ఆకట్టుకుంది. ఎంఎం కీరవాణి సంగీతానికి అందరూ ముగ్దులయ్యారు. ప్రస్తుతం దోస్తీ పాట నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
పాటే ఇలా ఉంటే సినిమా ఏ లెవల్ లో ఉంటుందో అంటూ అందరూ భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ నుంచి మొదటి పాట విజువల్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పాటలో ఎంఎం కీరవాణితో పాటుగా ఇద్దరు హీరోలు అయిన మెగా పవర్ స్టార్ రామ చరణ్, ఎన్టీఆర్ కూడా కనిపించడంతో వారి అభిమానులు పండగ చేసుకున్నారు. సినిమాను ఎంతో నిష్టతో అదిరిపోయే రీతిలో తీయడంలో రాజమౌళి అద్భతమైన చాకచక్యాన్ని ప్రదర్శిస్తారు. పాన్ ఇండియా సినిమాలు తీయడంలో ఆయన నేర్పరి. సినిమాలో ప్రతి ఎలిమెంట్ ను ఆయన అద్భుతంగా చిత్రీకరిస్తారు. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అక్టోబర్ లో సినిమా విడుదలకు సిద్దమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: