క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో అద్భుతాలను సృష్టించిన నరేష్..!!

N.ANJI
నాలుగు స్తంభాలాట సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటుడు నరేష్. ఆయన తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక హాస్య‌ల చిత్రాల క‌థానాయ‌కుడుగా.. ఎన్నో విభిన్నమైన పాత్ర‌ల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త గుర్తింపుని తెచ్చుకున్నారు సీనియ‌ర్ న‌టుడు న‌రేష్. అయితే మొదట హీరోగా ప్రయాణం మొదలుపెట్టి… క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి కమెడియన్ గా మారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరును తెచ్చుకున్నారు నరేష్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు.
అయితే నరేష్ మనసు–మమత’,‘పోలీసు భార్య’ ప్రేమ అండ్‌ కో’ అల్లరి రాముడు వంటి చిత్రలలో హీరోగా నటించిన నరేష్.. చందమామ కథలు, అందరి బంధువయ సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొత్త ప్రయాణం స్టార్ చేశారు. ఇక క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇటీవ‌ల దృశ్యం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, నేను శైల‌జ‌, అఆ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అలరించారు. నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నూట యాభై చిత్రాలకు పైగా నటించి సక్సెస్ ఫుల్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ.. ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ.. ముందుకు వెళ్తున్నారు.
అంతేకాదు.. నరేష్ కి కళల పట్ల తనకున్న ప్యాషన్ తో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కాగా.. కరోనా సమయంలో తోటి కళాకారులకు తనవంతు సాయం చేసి ఎంతోమందికి అండగా నిలిచారు. అయితే  దర్శకుడు జంధ్యాల, ఈవివి ప్రోత్సహంతో ప్రేమ సంకెళ్లు, నాలుగు స్థంబాలాట నుండి వందకు పైగా చిత్రాల్లో హీరోగా నటించారు నరేష్. కే సెకండ్ ఇన్సింగ్ స్టార్ చేసిన తరువాత అయన ఊహించని ఎన్నో పాత్రలో నటించారు. కరోనా సమయంలో అయన పదకొండు సినిమాలకు ఓకే చెప్పారు. అయితే అందులో ఒక పది చిత్రాల్లో డిఫరెంట్ వెరీయేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు. ప్రముఖ కమెడియన్ అలీ, నరేష్ హీరోలుగా అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి అనే సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: