పూర్ణ ఆ స్టార్ హీరోయిన్ చూసి ఇన్స్పైర్ అయ్యిందా ?
అల్లరి నరేష్ తో సీమటపాకాయ్ సినిమాలో జోడీగా వచ్చిన హీరోయిన్ పూర్ణ. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది ఈమె. ఇక ఈమె ప్రస్తుతం బుల్లితెరపై కూడా జడ్జిగా పలు చోట్ల కొనసాగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో కొంచెం పూర్ణ ఓవరాక్షన్ చేయడంతో ఓ పక్క నెటిజన్లు ఎంతో ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా కళ్యాణ్ జి గుణం డైరెక్షన్లో " సుందరి" అనే టైటిల్ తో ఒక సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో నటుడు "అంబటి అర్జున్" హీరోగా చేయడానికి సిద్ధమయ్యారు.
ఆగస్టు 13న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్ భాగంలోనే హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ.. కొన్ని విషయాలను తెలియజేసింది. ఈ సినిమాకు ఒక పెద్ద హీరోయిన్ నైనా తీసుకోవచ్చు.. కానీ నిర్మాత రిజ్వాన్ మాత్రం నాపై నమ్మకం ఉంచి హీరోయిన్ గా నన్నే పెట్టుకున్నారు. కానీ ఈ సినిమాను చేసే అంత స్టార్ హీరోయిన్ ని తాను కాదంటూ తెలిపింది. ఇలాంటి సినిమాలలో నటించడానికి ముఖ్య కారణం నయనతార అని తెలియజేసింది పూర్ణ.
నయనతార సినిమాలు చూసి బాగా ఇన్స్పైర్ అయి ఇలాంటి సినిమాలని చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చింది. అందుచేతనే ఈ చిత్రంలో నేను నటించడం జరిగింది. అంతేకాకుండా ఈ సినిమాని చూసి ప్రేక్షకులంతా ఆదరించండి అంటూ తెలిపింది పూర్ణ.