ఈ వారంలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!

Suma Kallamadi
కొవిడ్ వల్ల ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ ఘొరంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్ ముగిశాక కొద్ది రోజులో ఓపెన్ అయిన టాకీసులు సెకండ్ వేవ్‌తో మళ్లీ క్లోజ్ అయ్యాయి. తాజాగా మళ్లీ ఓపెన్ అవుతున్నాయి. అయితే, జనాలు ఈ టైంలో ఓటీటీలకు అలవాటు పడిపోయారనే చెప్పొచ్చు. మునుపటిలా సినీ ప్రియులు థియేటర్లకు రావడం లేదు. కరోనా నేపథ్యంలో ఓటీటీలో వచ్చిని సినిమాలే చూద్దామని అనుకుంటున్నారు.
 అయితే, పెద్ద సినిమాలు వస్తే వాటి కోసమైనా సినీ ప్రియులు వచ్చే అవకాశాలుంటాయి. ఇటీవల ‘తిమ్మరుసు, ఇష్క్’ చిత్రాలు థియేటర్లలో విడుదల కాగా, ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు టాకీసులకు వస్తున్నారు. కాగా, ఈ వారంలో ఐదు చిత్రాలు రాబోతున్నాయి. అవేంటంటే..యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ మూవీ ఈ నెల 6న విడుదల కాబోతున్నది. ఈ చిత్రంలో సీనియర్ యాక్టర సాయికుమార్ కీ రోల్ ప్లే చేస్తోంది.
హీరో కిరణ్‌కు జోడీగా ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ హీరోయిన్ ప్రియాంకా జువాల్కర్ నటిస్తోంది. ఈ చిత్రంతో పాటు ‘మెరిసే మెరిసే, ముగ్గురు మొనగాళ్లు, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, క్షీర సాగర మథనం’ చిత్రాలు ఈ నెల 6వ తేదీనే విడుదల కాబోతున్నాయి. ‘మెరిసే మెరిసే’ చిత్రంలో దినేష్ తేజ్, శ్వేతా అవస్థి హీరో హీరోయిన్లుగా నటించారు. వెంకటేష్ కొత్తూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ ఫిల్మ్‌ను కొత్తూరి ఎంటర్‏టైన్మెంట్స్ ఎల్ఎల్పీ బ్యానర్ పై పవన్ కుమార్.కె ప్రొడ్యూస్ చేశారు. పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం విడుదల కాబోతున్నది. ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రంలో సీనియర్ కామెడియన్ శ్రీనివాస్‌రెడ్డి, దీక్షిత్‌శెట్టి, వెన్నెల రామరావు మెయిన్ రోల్స్ ప్లే చేశారు. ఈ ఫిల్మ్‌లో రాజారవీంద్ర, దివంగత నటుడు, జర్నలిస్ట్ టీఎన్‌ఆర్ కీ రోల్స్ ప్లే చేశారు. ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ మూవీలో హస్వంత్ వంగ, నమ్రత దరేకర్, కళ్యాణ్ గౌడ ప్రధాన పాత్రలు పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: