'పుష్ప' సినిమాకు అదే రిపీట్ అవుతుందా..?
జగడం: సినిమా థియేటర్ల వద్ద నిరాశపరిచిన దేవిశ్రీ సమకూర్చిన సంగీతానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
ఆర్య టు: ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు హైలెట్ అని చెప్పవచ్చు.
100% లవ్: ఈ సినిమాలో నాగచైతన్య, తమన్న ఇద్దరు బావ మరదలు వీరిద్దరి మధ్య ఉన్న చదువు పోటీని, మరియు బంధాన్ని తెలిపే విధంగా దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీతం ఈ సినిమా విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది.
1 నేనొక్కడినే: ఈ సినిమా థియేటర్ల వద్ద బోల్తా పడిన దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి మాత్రం సినీ జనం నుండి మంచి మార్కులే పడ్డాయి.
నాన్నకు ప్రేమతో: ఈ సినిమా కథ ప్రకారం తండ్రి కొడుకుల మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే విధంగా దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం ఒక అద్భుతం అని చెప్పవచ్చు.
రంగస్థలం: ఈ సినిమా స్వచ్ఛమైన పల్లెటూరి నేపథ్యం కలిగినది. మరీ ముఖ్యంగా ఈ కథ 1980ల కాలంలో జరుగుతుంది. ఇలాంటి కథకు చాలా జాగ్రత్తగా సంగీతం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బాధ్యతను దేవి శ్రీ ప్రసాద్ చాలా అద్భుతంగా నెరవేర్చాడు.
ఇలా ఇప్పటి వరకు సుకుమార్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న 'పుష్ప' సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈసారి కూడా ఎప్పటిలాగానే మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడు అని సినీజనం తో పాటు ప్రేక్షకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి 'పుష్ప' సినిమా పాటలు జనాలకు ఏ రేంజ్ కిక్ ని ఇస్తాయో తెలియాలంటే సినిమా పాటలు విడుదల అయ్యే అంతవరకు ఆగాల్సిందే.