తన గ్లామర్ సీక్రెట్ చెప్పేసిన కాజల్?
అయితే ఇప్పుడు కాజల్ తీసుకునే ఆహారం సీక్రెట్ ఏంటో తెలిసిపోయినట్లు సమాచారం. ఎవరైనా కాజల్ అగర్వాల్ లాంటి మంచి ఫిగర్ కావాలంటే ఆమె తీసుకునే ఆహారం మరియు తీసుకునే సమయం తెలుసుకొని ఫాలో అయిపోవచ్చు. కాజల్ రోజూ ఉదయాన్నే ఓ గుడ్డు తింటుందట.ఉదయాన్నే యోగ చేస్తుందట. ఆ స్విమ్ చేయడం తన హాబీ అని తెలిసింది.ఆ తరువాత గంట విరామం ఇచ్చి ఏదోక కూరతో చేసిన వేడి వేడి జొన్న రొట్టెలు తింటుందట.ఆ తరువాత మధ్యాహ్నం భోజనానికి సుమారు 2 గంటల ముందు ఏదైనా ఒక పండు తింటుందట. ఇక మధ్యాహ్న భోజనంలో భాగంగా అందరు తినే విధంగానే పప్పు, అన్నం, కూరగాయలు తింటుందట.
సాయంత్రం ఏదైనా టేస్ట్ గా బర్గర్ లేదా శాండ్ విచ్ వంటి జంక్ ఫుడ్ తింటుందట. ఇక రాత్రి భోజనంలో మధ్యాహ్న సమయంలో తిన్న భోజనమే మళ్లీ వేడి వేడిగా తినేస్తుందట. రోజంతా మధ్యమధ్యలో తన దాహాన్ని తీర్చుకోడానికి ప్రోటీన్ మిల్క్ షేక్ లేదా కొబ్బరి నీళ్లు తాగుతుందట. వీటికి అదనంగా ఉదయం మరియు సాయంత్రం గ్రే టీ తాగుతుందట. కాజల్ పూర్తిగా శాఖాహారి కావున ఆమె ఎక్కువగా ప్రోటీన్ మిల్క్ షేక్స్ అంటే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుందట.
తనకు బాగా ఇష్టమైన రాజ్మా చావల్ మరియు పన్నీర్ అలాగే తనకు ఎంతో ఇష్టమైన తన తల్లి చేసే పరోటాలు అంటే పిచ్చ ఇష్టమని గతంలో కాజల్ చెప్పినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ వంటకాలు కూడా చాలా చాలా ఇష్టమని చెప్పిందట. ప్రతిరోజూ తన ఫుడ్ మెనూలో ఫైబర్ మరియు కార్బోహైడ్రేట్స్ అలాగే ప్రోటీన్లు కూడా ఎక్కువ ఉండేలా జాగ్రత్త తీసుకుంటుందట. ఇక వీటితో పాటు జిమ్ లో కసరత్తులు చేస్తుంటుందట. రోజుకి కనీసం రెండు గంటలైనా యోగ మరియు వ్యాయామాల కోసం సమయం కేటాయిస్తాను అని చెప్పిందట. ఇక ఆమె అందం విషయానికి వస్తే IS అనే బ్రాండ్ కి చెందిన సౌందర్య ఉత్పత్తులని మాత్రమే ఆమె ఎక్కువగా వాడుతుందని సమాచారం.
ఇక ఆమె సినీ కెరీర్ విషయానికొస్తే కరోనా సమయంలో అందరి దృష్టి ఓటీటీలపై పడినట్లు సమాచారం. అందుకే కాజల్ కూడా వెబ్ సిరీస్ లు చేయడంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే తను కొంతకాలం క్రితం 'లైవ్ టెలికాస్ట్' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ పొందింది. కానీ తనకు ఎలాంటి బిగ్గెస్ట్ ఆఫర్ రాలేదట. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తెలుగులో 'ఆచార్య' సినిమా చేస్తుంది. అలానే బాలీవుడ్ లో 'ఉమా' అనే మంచి కథతో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది.దీన్ని తథగత సింగ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కలకత్తాలో జరుగుతున్నట్లు సమాచారం.