కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ టైంలో మహిళలపై వేధింపులు, గృహ హింస కేసులు బాగా పెరిగాయని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే, ప్రస్తుతం కూడా గృహహింస కేసులు నమోదవుతున్నాయి. సెలబ్రిటీలూ ఈ కేసుల్లో బాధితులుగా ఉన్నారు. బాలీవుడ్ సింగర్ యోయో హనీ సింగ్‌పై తన భార్య గృహ హింస కేసు పెట్టింది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ అర్పూ గోవిత్రికర్ తన భర్తపై గృహ హింస కేసు పెట్టింది. తన భర్త సిద్ధార్థ్ శబర్వాల్ తనను సామాజిక వర్గం పేరిట దూషిస్తున్నారని నటి ఆరోపించింది. ఈ క్రమంలోనే విడాకులకు అప్లై చేసినట్లు అర్పూ తెలిపింది. అయితే, గతంలోనే అనగా 2019లో భర్తపై గృహహింస కేసు పెట్టిన గోవిత్రికర్ తాజాగా మళ్ల కేసు పెట్టింది. తన భర్తకు సంబంధించిన విషయాలను మీడియాకు తెలిపింది. తాను తన భర్త సిద్ధార్థ్‌తో కలిసి ఉండేందుకుగాను ఎంతగానో ప్రయత్నించానని చెప్పింది. తనను ఇంట్లోంచి గెంటేయడానికి భర్త ప్రయత్నించినట్లు తెలిపింది. ఎన్నోసార్ల కడుపులో తన్నాడని, విచక్షణా రహితంగా కొట్టాడని మీడియా ఎదుట వాపోయింది బాలీవుడ్ నటి. తన భర్త రష్యన్ గర్ల్ ఫ్రెండ్‌తో వేరే గదిలో ఉంటూ చాటింగ్ చేస్తూ ఉంటాడని చెప్పింది.
అయితే, బాలీవుడ్ నటి ఆరోపణలను సిద్ధార్థ్ పూర్తిగా ఖండించాడు. తను ఆమె ఆరోపణలపై రియాక్ట్ కాబోనని పేర్కొన్నాడు. కాగా, తన భర్త సిద్ధార్థ్ వేరే గదిలో పడుకోవడం మొదలు పెట్టినప్పటి చేసిన పనులకు సంబంధించిన వీడియోలన్నీ తన వద్ద ఉన్నాయని అర్పూ గోవిత్రికర్ తెలిపింది. తనతో కలిసి ఉండాలని చాలా ప్రయత్నించానని, అయినా ఆయన బిహేవియర్లో మార్పు రాలేదని చెప్పింది. తనపైన దాడి చేసినప్పటి వీడియోలతో పాటు సిద్ధార్థ్ తన రష్యన్ గర్ల్ ఫ్రెండ్‌తో చేసినప్పటి బిహేవియర్‌కు సంబంధించిన వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్ తన వద్దు ఉన్నాయని అర్పూ పేర్కొంది. ఈ క్రమంలో పోలీసులు ఆయనపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి మరి..
మరింత సమాచారం తెలుసుకోండి: