'కేజిఎఫ్ 2' క్లైమాక్స్ లో మార్పు... షాక్ ఇచ్చేలా ఉన్నాడుగా ?
కేవలం ఈ ఒక్క షూట్ కోసం దాదాపు 10 కోట్ల వరకు ఖర్చయిందని వినికిడి. మరి ఇంతటి భారీ స్థాయిలో రూపుదిద్దుకున్న ఆ సన్నివేశం ఏమిటో తెరపైనే చూడాల్సి ఉంది. అయితే ఈ విషయంపై క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. కేజిఎఫ్ చాప్టర్ 1 కన్నడలో తప్ప మిగిలిన ఏ భాషలోనూ పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై
మొత్తం దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంచలనంగా మారగా ఇప్పుడు ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదల కానున్న కేజిఎఫ్ చాప్టర్ 2 అంతకు మించిన వసూళ్ల వర్షం కురిపిస్తుంది అని అంతా అనుకుంటున్నారు.
ఈ సినిమాపై ఎంత హైప్ ఉందంటే ఇప్పుడిప్పుడు రిలీజ్ చేసినా బ్లాక్ బస్టర్ హిట్ చేసేస్తారు. ఇందులో కథే హీరో.. ఆ తరువాత హీరో యశ్ నటన ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతుంది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పాత్రను ఎంతగా ఎలివేట్ చేసి ఉంటారో ఊహించలేము. ఈ సినిమాతో యశ్ రేంజ్ ఎంతలా మారిందో చూశాము.