ఓటీటీ ల పై స్పందించిన కాజల్..

Divya
సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో స్టార్ పొజిషన్ ని అనుభవిస్తున్న హీరోయిన్లలో కాజల్ కూడా ఒకరు. ఇకపోతే ఈమె పెళ్లికి ముందు ఎంత మంచి స్టార్ పొజిషన్ ను  అనుభవించిందో,  పెళ్లి తర్వాత కూడా అంతే విధంగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు కొట్టేస్తే రేసుగుర్రంలో ముందుకు దూసుకు వెళుతోంది. ఇకపోతే ఇటీవల ఈమె చేసిన కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అవేమిటంటే ఓటీటీలపై ఒకపక్క మంచిగా మాట్లాడుతూనే, మరోపక్క  ఓటీటీలు రావడంతో థియేటర్ వ్యవస్థ అనేది నాశనం అవుతోంది అంటూ కామెంట్ చేయడం ఇక్కడ చర్చనీయాంశం గా మారింది..


నిజానికి ఈ కరోనా రావడం చేత అటు వెండితెర, ఇటు బుల్లితెర 2 ఇండస్ట్రీలు బాగా దెబ్బతిన్నాయని చెప్పవచ్చు. ఇక ఇదే సమయంలో  ఓటీటీలు రావడంతో పాటు టీవీ, బిగ్ స్క్రీన్  పరిశ్రమల  అనుభవాలను పూర్తిగా ఓటీటీ అధిగమించింది అంటూ కాజల్ చెప్పుకొచ్చింది.. ఇక ఈ నేపథ్యంలోనే ఓటీటీలలోనే  ప్రజలు ఎక్కువగా ఇంట్లో కూర్చుని సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. థియేటర్లకు వెళ్లడానికి కూడా మొగ్గు చూపకపోవడంతో అటు సినీ ఇండస్ట్రీలో తారలకు అలాగే థియేటర్లకు కూడా భారీగా నష్టం వాటిల్లుతుందని ఆమె చెప్పుకొచ్చింది..


అంతేకాకుండా ఆమె చెప్పిన మరో విషయం ఏమిటంటే.. "పూర్తిగా ఓటీటీల హవానే కొనసాగుతుందని చెప్పడం.. నా ఉద్దేశ్యం కాదు.. ఓటీటీలు వచ్చిన తరువాత థియేటర్ల హవా తగ్గిందని చెబుతున్నాను.." అంటూ చెప్పుకొచ్చింది ముద్దుగుమ్మ.." ఇక అంతే కాదు సమాజంలో మార్పులు సంభవించడం సహజం.. థియేటర్ల హవా మొదలైనప్పుడు తప్పకుండా ఓటీటీలను ప్రేక్షకులు పక్కన పెట్టక తప్పదు. ఇకపోతే ఈ ఓటీటీల పుణ్యమా అని, ఎంతో మంది కొత్త నటీనటులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇది కొత్తవాళ్ళకు  ప్రయోగానికి మంచి వేదిక  అంటూ చెప్పుకొచ్చింది". ఇక ఈమె చేసిన కామెంట్స్ చూసిన నెటిజన్లు, ఈమె ఓటీటీలకు సపోర్ట్ చేస్తుందా..? లేక థియేటర్లకు సపోర్ట్ చేస్తోందా..? అనే విషయంపై క్లారిటీ లేక ఏదైనా ఉంటే సూటిగా చెప్పండి.. అంటూ కూడా నెటిజన్లు వాపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: