కరోనా సెకండ్ వేవ్ భారతదేశంలో ఉధృతంగా చెలరేగడంతో థియేటర్లను మూసివేయాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.
కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం తిరిగి థియేటర్లను తెచ్చుకోవచ్చు అని అనుమతి కూడా జారీ చేసింది. దానితో కొన్ని సినిమాలు దియేటర్ లలో విడుదలకు ముందుకు వచ్చాయి. అలా ముందుకు వచ్చిన వాటిలో మనం ప్రధానంగా మాట్లాడు కోవాల్సింది
తేజ సజ్జ హీరోగా నటించిన 'ఇష్క్' మరియు ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న
హీరో సత్యదేవ్ నటించిన 'తిమ్మరుసు' ఈ రెండు సినిమాలు పోయిన వారం థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు పర్వాలేదు బాగానే ఉన్నాయి అనే టాక్ ని సొంతం చేసుకున్న కూడా థియేటర్లకు మాత్రం జనం అంతగా రావడం లేదు . దీనితో విశ్లేషకులు
కరోనా సెకండ్ వేవ్ తర్వాత మొదటగా వచ్చిన సినిమాలు కాబట్టి వీటి పరిస్థితి ఇలా ఉంది. మరో వారం వరకు ఈ పరిస్థితి మారుతుంది అని భావించారు. కానీ ఈ వారం కూడా దియేటర్ లలో దాదాపు ఏడు సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి.
అందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినది.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'ఎస్ఆర్ కళ్యాణమండపం' ఈ
సినిమా నుండి విడుదలైన పాటలు మరియు ట్రైలర్లు, టీజర్ల తో జనాల్లో మంచి అంచనాలను నెలకొల్పింది. ఈ
సినిమా తో థియేటర్లు జనాలతో కళకళలాడతాయి అని కొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ సినిమాకు మంచి టాక్ వచ్చిన కూడా జనాలు మాత్రం సినిమాపై అంత ఇంట్రెస్ట్ చూపడం లేదు. దానికి ప్రధాన కారణం దేశంలో కొంచెం కొంచెంగా పెరుగుతున్న
కరోనా కేసులు అని కూడా చెప్పవచ్చు. మరి థియేటర్లు జనాలతో కళకళలాడేది ఎప్పుడు అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తుంటే, మరికొంత మంది దానికి స్టార్ హీరోల సినిమాలు థియేటర్లోకి రావాల్సిందే అని అంటున్నారు. మన తెలుగు స్టార్ హీరోలు థియేటర్ల లోకి రావాలి అంటే దాదాపు 2 నెలల కంటే ఎక్కువ సమయమే ఉంది. మొదటగా దర్శకధీరుడు
రాజమౌళి దర్శకత్వంలో
రామ్ చరణ్,
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్'
సినిమా అక్టోబర్ లో విడుదల కానుంది. ఆ తర్వాత
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప'
సినిమా క్రిస్మస్ కానుకగా
డిసెంబర్ లో విడుదల కానుంది .దాని తర్వాతే మహేష్ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' . పవన్ కళ్యాణ్, రానాలు కలిసి నటిస్తున్న
సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానుంది. వీటితో పాటే
ప్రభాస్ హీరోగా పాన్
ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్' కూడా సంక్రాంతికి విడుదల కానుంది. ఇలా స్టార్ హీరోలతోనే థియేటర్లకు పట్టిన బూజు వదులుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.