కాజల్ అగర్వాల్. ఈ పేరు తెలియని వాళ్ళు లేరు. అందుకే ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కాజల్ సినీ కెరీర్ మొదలై సుమారు 14 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే హవా కొనసాగొస్తుంది.ఈ అందమైన చందమామ 2020లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతు ఉంది. ముఖ్యంగా ఈ అమ్మడు తన ఫుల్ అందమైన పోజులతో మత్తు ఎక్కిస్తుంది.అలాంటి ఫోజులతో చందమామను చూసి యువత మతులు చెడిపోతున్నాయి. కాజల్ అగర్వాల్ చూపులతోనే చంపేస్తుంది. ఈ అందమైన ముద్దుగుమ్మ చిన్న హీరోలతో పాటు పెద్ద హీరోల సినిమాలతోనూ బిజీగా ఉంది. కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా కొనసాగడం అంత సామాన్య విషయం కాదు. అస్సలు ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ కి పెళ్లి అంటే చాలు అక్కడితో ఆమె కెరీర్ పూర్తి అయిపొయింది అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.
పెళ్లి తర్వాత కూడా హీరోయిన్లను ఒకప్పటి హీరోయిన్ లానే చూసుకుంటున్నారు. వాళ్లకు అవకాశాలు కూడా భారీగానే ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాత ఇంకా భారీ ఆఫర్స్ ఎక్కువగానే వస్తున్నాయి. ఇప్పుడు కాజల్ దీనికి ఒక నిదర్శనం అని చెప్పాలి. ఈమెకు గత సంవత్సరం బిజినెస్ మ్యాన్ అయిన గౌతమ్ కిచ్లుతో పెళ్ళి చేసుకుంది. అయితే పెళ్లి అయిన తర్వాత కూడా వరసగా సినిమాలు చేసుకుంటూ పోతూ ఉంది కాజల్. ఇంకా చెప్పాలంటే మ్యారేజ్ తరువాత సంచలనమైన పాత్రల్లో నటిస్తుందట ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ చేసిన కొన్ని కామెంట్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. OTT రాకతో ఓ పక్క భారీ ప్రయోగాలు చేయడానికి అవకాశం దొరికిందనట్లయిందని చెబుతూనే మరోపక్క OTT కారణంగా థియేటర్ వ్యవస్థ చాలా దెబ్బ తింటుంది అని చెప్పుకొచ్చింది. కరోనా వల్ల వెండితెర, బుల్లితెర ఇండస్ట్రీలు బాగా దెబ తిన్నాయని చెప్పిందట
అదే సమయంలో OTT వచ్చి టీవీని, బిగ్ స్క్రీన్ అనుభవాన్ని తగ్గించింది అని చెప్పుకొచ్చింది. ప్రజలు తమ ఇంట్లో కూర్చొని OTT కంటెంట్ చూడడానికి బాగా అలవాటు పడ్డారని ఇది థియేటర్లకు అస్సలు మంచిది కాదని తన అభిప్రాయం తెలిపింది.అయితే ప్రస్తుతం వస్తున్న పరిస్థితులు కొంత కాలమే అని అంటోంది. ఎప్పటికైనా ఇండియాలో ఓటీటీపై థియేటర్లదే హవా సాగుతుంది అని చెబుతోంది. సినిమా థియేటర్ అనుభవం పూర్తిగా మరుగునపడుతుంది తను అస్సలు భావించడం లేదని అదెప్పుడూ సమాజంలో ఉండవలసిందే అని చెప్పుకొచ్చింది. ఎప్పుడైతే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయో అప్పుడు ప్రేక్షకులు OTT ని పక్కన పెడతారని తెలిపింది. అయితే OTT కారణంగా వెండితెరపై చేయలేని ప్రయోగాలను చేసే అవకాశం వచ్చిందని తెలిపింది.