ఈ సినిమాలు చేసుంటే...స్టార్ హీరోగా సుమంత్ ఎదిగే వారేమో..!
1) నువ్వే కావాలి:
తను మొదటగా ప్రేమ కథ అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి, తన మొదటి సినిమాను భారీ అంచనాల నడుమ విడుదల చేశారు. కానీ ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్ ను రాబట్టలేకపోయింది. ఈ సినిమాకి రాంగోపాల్ వర్మ డైరెక్టర్ చేయడం గమనార్హం. ఇక నువ్వే కావాలి సినిమా కథ ముందుగా సుమంత్ దగ్గరకి వచ్చిందట. కానీ ఈ సినిమా కథను సుమంత్ నెగ్లెట్ చేయడంతో, ఆ తర్వాత, తిరిగి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది.ఈ హీరో కూడా వదులుకోవడం తో తరుణ్ దగ్గరికి వచ్చింది ఈ సినిమా. ఇక తరుణ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు.
2) మనసంతా నువ్వే:
సుమంత్ వదులుకున్న సినిమాలలో ఇది కూడా ఒక ఆణిముత్యం లాంటి సినిమానే. ఈ సినిమా ముందుగా మహేష్ బాబు ని అనుకో గా, ఈ సినిమా చాలా స్లో గా ఉండడంతో ఆయన ఒప్పుకోలేదు. ఇక సుమంత్ ను కూడా అడగగా, తన మొదటి సినిమాతో బిజీగా ఉండడంతో ఆయన ఈ సినిమాలో ఒప్పుకోలేదు. ఉదయ్ కిరణ్ దగ్గరికి చేరింది.
3). ఆనందం:
సుమంత్ ఈ సినిమా కథ అంతా విని బాగలేదు అని చెప్పేశాడట. అప్పటివరకు సుమంత్ నటించిన కొన్ని సినిమాలు (యువకుడు, ప్రేమ కథ, పెళ్లి సంబంధం) ఫ్లాప్ అవడంతో ఈ సినిమాను వద్దని చెప్పేసాడు.
4). పోకిరి:
మహేష్ కెరీర్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా రూపొందింది ఈ చిత్రం. పూరి జగన్నాథ్ ముందుగా ఈ కథ సుమంత్ కు చెప్తే , ఆయనకు అర్థం కాకపోవడంతో ఈ సినిమాను కూడా వదిలేశాడు సుమంత్.
ఇక అలాగే గమ్యం వంటి సినిమాను కూడా వదిలేశాడు, నువ్వొస్తావని, దేశముదురు వంటి బ్లాక్ బాస్టర్ మూవీస్ ను కూడా వదులుకొని, ఇపుడు హీరోగా కూడా గుర్తింపు పొందలేని పరిస్థితిలో ఉన్నాడు హీరో సుమంత్. ఇక రాబోయే కాలంలో నైనా మంచి సినిమాల కథను ఓకే చెబుతాడని మనము ఆశిద్దాం.