నిధి అగర్వాల్ కు ఆ స్టార్ హీరో డాన్స్ ఇష్టమట?
టాలీవుడ్ లో అస్సలు ఆఫర్ ఎలా వచ్చింది అనే ప్రశ్నకు ఆమె మున్నా మైకల్ హిందీ సినిమాలో తన యాక్టింగ్ చూసి సవ్యసాచి డైరెక్టర్ చందు ఆమెకు తెలుగులో తొలి అవకాశం ఇచ్చాడట. ఆమె మొదటి సినిమా హిందీలో చేసింది. ఆ సినిమానే మున్నా మైకల్.ఈ సినిమాలో ఆమెది డాన్సర్ పాత్రట. ఆమె స్వతహగా మంచి డాన్సరట.బెల్లి డాన్స్ లో ఎనిమిదేళ్లు శిక్షణ తీసుకుందట.కథక్ లో కూడా కొద్దిగా శిక్షణ ఉందట.నిధి డాన్స్ ను టైం పాస్ కోసం కాకుండా ఎంతో ఇష్టంగా చేస్తుందట. డాన్స్ ను స్పిరిట్యువల్ గా చూస్తుందట.డాన్స్ ప్రధానముగా వుండే సినిమా ఆఫర్ వస్తే వదులుకోను కచ్చితంగా చేస్తాను అని చెప్పిందట.ఆ పాత్రని తాను ఎంతో ఇష్టంగా చేస్తాను అని చెప్పిందట.
తెలుగులో మొదటి సినిమా చేస్తున్న సమయంలో తనకి ఒక్క తెలుగుపదం కూడా రాదట.అస్సలు అర్థం అయ్యేది కాదట. డైరెక్టర్ చందు చాలా సహనంతో తనకు నేర్పించారని చెప్పిందట.తొలిసారి తాను సెట్ లోకి వెళ్ళినపుడు తనకి ఏకైక భయం భాష డైలాగ్ లట.అయితే సినిమా టీం తనకి సపోర్టివ్ గా ఉండి తనకి ఎంతగానో సహాయం చేశారట.ఇప్పుడు తెలుగు బాగా అర్థం అవుతుందట. కానీ మాట్లాడేటప్పుడే కొన్ని బ్రేకులు వస్తాయట.సినిమాలు చేస్తున్నప్పుడే చాలా వరకు నేర్చుకుందట. అది కూడా mr. మజ్ను సినిమాలో చాలా పెద్ద డైలాగ్ లు వుంటాయట.ఆ సినిమాతోనే తనకి తెలుగు చాలా భాగం వచ్చేసిందట.నిధి అగర్వాల్ కు టాలీవుడ్ లో అల్లు అర్జున్ డాన్స్ అంటే చాలా ఇష్టమట అలాగే తనకి బాలీవుడ్ లో టైగర్ షరఫ్ డాన్స్ అంటే చాలా ఇష్టమని చెప్పిందట