మహేష్ కు సహాయం చేసిన పవన్.. కారణం..

Divya
టాలీవుడ్ లో ఎక్కువగా హీరోల అభిమానులు గొడవ పడుతున్న విషయాలను మనం చూస్తూనే ఉంటాం. అయితే తమ అభిమానులు మా హీరో గొప్ప, అంటూ ఇతర హీరోల పై కామెంట్ చేస్తూ ఉంటారు. అందుకోసమే ఇలాంటివి జరగకుండా ఉండేందుకు మన హీరోలు అందరూ కలిసి ఉండేలా అప్పుడప్పుడు కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

అలా పెట్టిన ఫోటోలు చాలా వైరల్ గా  మారుతూనే ఉంటాయి. ఇక కొన్ని ఆడియో ఫంక్షన్ లో కూడా స్టార్ హీరోలు సైతం హాజరు కావడం జరిగింది కొంత మంది హీరోలకు. ఇక అప్పుడు కూడా వారు మేమందరం ఒకేలా ఉంటున్నాము.. మీరు కూడా అలానే ఉండండి.. అంటూ తెలియజేస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్, మహేష్ బాబుకు.. వీరిరువురికి విపరీతమైన క్రేజ్ ఉంది.

అయితే వీరివురూ ఈ మధ్య కాలంలో  సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఎప్పుడు మాట్లాడుకోవడం చూడలేదు.  అయితే ఒకప్పుడు మాత్రం మహేష్ బాబుకు ఒక విధంగా పవన్ కళ్యాణ్ సహాయం చేసినట్లు తెలుస్తోంది. అదేమిటంటే.. మహేష్ బాబు హీరోగా శ్రేయ హీరోయిన్ గా, కలిసి నటించిన చిత్రం"అర్జున్". ఈ చిత్రంలో మహేష్ అద్భుతంగా నటించాడు. కానీ ఈ సినిమా పైరసీ బారిన  పడడంతో చాలా ఇబ్బందులకు గురి అయ్యారు.. ఆ చిత్ర యూనిట్ సభ్యులు.

ఇక ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అప్పట్లో ఇలాంటివి చేయడం తప్పు. ఎటువంటి హీరో అయినా సరే సినిమాలో చేయడానికి ఎంతో కష్టపడి ఉంటారు. అలా పైరసీ బారిన పడితే నిర్మాతలు చాలా నష్టపోవాల్సి ఉంటుందని, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మహేష్ కు ఆ విధంగా సహాయం చేసినట్లు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించింది. అంతేకాదు  పవన్ కళ్యాణ్  మహేష్ బాబు సినిమాలకు బ్యాక్ గ్రౌండ్  వాయిస్ అందిస్తున్నట్లు సమాచారం. ఇక అంతే కాకుండా త్రివిక్రమ్ మహేష్ కూడా మంచి స్నేహితులు కావడంతో, ఆ సహాయం చేశాడని కూడా వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: