నాకు ఆ పని ఇష్టం ఉండదు అంటున్న నభానటేష్..!
వర్షాలు కురుస్తున్న సమయంలో కాగితపు పడవలు చేసేవారా..?
కాగితపు పడవల ఎంజాయ్మెంట్ ని అస్సలు మిస్ అయ్యేదాన్ని కాదు.. ఇంటి దగ్గరే ఉన్న ఒక చిన్న స్ట్రీట్ లో కాగితపు పడవలు వదిలే దాన్ని.. అది కూడా నేను అస్సలు తడవకుండా.
చివరి సారి ఎప్పుడు ఫుల్ గా తెరిచారు..?
ఓ సినిమా షూటింగ్ లో భాగంగా చాలా తడిచాను.. కానీ అది సినిమా షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన కృత్రిమ వర్షం.. అయితే నాకు వర్షంలో తడవడం పెద్దగా ఇష్టం ఉండదు.
వర్షాకాలం ని ఎలా ఆస్వాదిస్తారు..?
వర్షాకాలంలో ఫుడ్‌ను ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాను.. పుట్టింది తినడం కోసమే అన్నట్లు తింటూ ఉంటాను.. మా అమ్మ చేసే మిర్చి బజ్జి, కాఫీ నా ఫేవరెట్.. వర్షం పడుతున్నప్పుడు ఇవే పర్ఫెక్ట్.
వర్షాకాలంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు..?
చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాను.. నేను కొంచెం తడిసిన నాకు వెంటనే జలుబు చేస్తోంది.. అందుకే పెద్దగా నేను తడవాలి అనుకోను.. అందుకే నేను ఎప్పుడూ బయటికి వెళ్ళినా నా వెంట గొడుగు తీసుకు వెళతాను.. టిష్యూ పేపర్స్ ని కూడా క్యారీ చేస్తుంటాను.
వర్షాకాలంలో మీ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది..?
వర్షాకాలంలో బయటికి వెళ్తే ఎవరు గుర్తుపట్టలేనంతగా నన్ను నేను కవర్ చేసుకుంటాను..
సాధారణంగా చిన్న పిల్లలను ఇంట్లో తడవనివరు.. మరి మీ ఇంట్లో..?
వర్షాలు అప్పుడప్పుడు వస్తే ఓ మజా ఉంటుంది.. కానీ మా ప్రాంతంలో ఎప్పుడూ వర్షాలే కదా.. పైగా బాగా చలిగా ఉంటుంది దానితో నాకు బయటికి వెళ్ళడం పెద్దగా నచ్చేది కాదు. అందుకే మా అమ్మకు కొపడాల్సిన పని తప్పింది.
మరి వర్షం పాటలో నటించడం మీకు ఇష్టమేనా..?
పెద్దగా ఇష్టం లేదు వర్షం కురుస్తున్నప్పుడు ఇంట్లో రెయిన్ పాటలకు డాన్స్ చేయడం ఇష్టం.
నచ్చిన రెయిన్ సాంగ్..?
అక్షయ్‌కుమార్, రవీనా టాండన్ నటించిన ‘మొహ్రా’ చిత్రంలోని పాట) 'టిప్ టిప్ బర్సా పానీ' అంటే ఇష్టం.
చిన్నతనంలో వర్షాకాలపు జ్ఞాపకాలు..?
వర్షాకాలం చాలా ఎక్కువగా నమోదు అయ్యే చిక్‌మగలూర్ మా స్వస్థలం. నా చిన్నతనంలో ఆ ప్రాంతం అంతా ఎప్పుడూ చిత్తడి చిత్తడిగా ఉండేది. ఎప్పుడూ బురదగా కూడా ఉండేది.. వర్షాకాలంలో నేను నాలుగైదు జతల స్లిప్పర్స్‌ను మార్చేసే దాన్ని. అందుకే నాకు వర్షాకాలం సీజన్ అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఏదైనా పని కోసం బయటికి వెళ్ళినప్పుడు వర్షం లో చిక్కుకోవద్దు వచ్చేది. ఇలా వర్షంతో తన జ్ఞాపకాలను నవ నటి చెప్పుకొచ్చింది.