ఆ డైరెక్ట‌ర్‌తో సెట్లోనే గొడ‌వ ప‌డిన మ‌హేష్ ?

VUYYURU SUBHASH
మహేష్‌బాబు పరువును గంగలో కలిసిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బ్రహ్మోత్సవం అనే చెప్పాలి. మ‌హేష్ కెరీర్‌లో డిజాస్టర్ సినిమా అయినా వ‌న్ నేనొక్క‌డినే సినిమా విమర్శకుల ప్ర‌శంస‌లు సైతం పొందింది. ఫ్లాప్ అయినా మహేష్ ఓ మంచి ప్రయత్నం చేశాడని ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. అయితే బ్రహ్మోత్సవం సినిమా అస‌లు మ‌హేస్‌ ఎందుకు ? చేసాడో ఎవరికీ ఎప్పటికీ అర్థం కాదు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీమియర్ షో చూస్తున్న ప్రేక్షకులకు ఆకాశంలో చుక్కలు కనపడ్డాయి. ఎవరికి వారు ఎప్పుడు థియేటర్ తెరుస్తారా ? బయటికి పారిపోదామా అని ఉక్క పట్టుకుని మరి ఉన్నారు. సమంత - కాజల్ అగర్వాల్ - ప్రణీత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు పొట్లూరి వర ప్రసాద్ నిర్మాత .

వాస్తవంగా చెప్పాలంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి హిట్ సినిమా ఇచ్చిన శ్రీకాంత్ శ్రీమంతుడు షూటింగ్ జరుగుతూ ఉండగా సెట్లోనే మ‌హేష్‌ను క‌లిశాడ‌ట‌. ఒక ఫ్యామిలీ కథ సీత‌మ్మ వాకిట్లో స్టోరీ లా ఉంటుంది అని చెప్పిన వెంటనే మహేష్ పూర్తిగా క‌థ విన‌కుండానే ఓకే చెప్పేశాడట. తీరా చూస్తే ఈ సినిమా షూటింగ్ స‌గం పూర్తయ్యాక కానీ అసలు కథ రెడీ కాలేదన్న‌ విషయం మహేష్‌కు తెలియ లేదట. శ్రీకాంత్ ఏ సీన్ ఎటు తీస్తున్నాడో కూడా ఎవ్వ‌రికి అర్థం కాలేద‌ట‌.

శ్రీకాంత్ అడ్డాల పూర్తి కథ రెడీ చేసుకోకుండానే మహేష్ ను నమ్మించి సినిమాను ఓకే చేయించుకున్నాడు. సినిమా స‌గం అయిన వెంటనే సినిమా ఫలితం ఎలా ఉంటుందో మహేష్‌కు క్లారిటీ వచ్చేసిందట. దాంతో కేక‌లు వేసిన మ‌హేష్ సెట్స్ నుంచి వెళ్లిపోయాడ‌ట‌. తర్వాత పదిహేను రోజులు షూటింగ్‌కు విరామం ఇచ్చి శ్రీకాంత్ ను పూర్తి కథ రెడీ చేయమని సూచించాడట. అయితే మహేష్ ఊహించినట్టుగానే బ్రహ్మోత్సవం ఘోరమైన ప్లాప్ అవడంతో పాటు మహేష్ పరువు తీసేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: