రానా పెండ్లి రోజు ఎంత గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకున్నాడో తెలుసా..?

Suma Kallamadi
ఆగస్టు 8న‌ దగ్గుబాటి రానా పెండ్లి రోజుల అని ఎక్కువ మందికి తెలియ‌దు. గత సంవత్సరం ఇదే రోజున హీరో రానా తన చిరకాల స్నేహితురాలు మిహీకా బజాజ్ ను పెండ్లి చేసుకున్నాడు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో సన్నిహిత వేడుకలో ప్రయివేట్ ఎఫైర్ తరహాలో రానా వివాహం చేసుకున్నాడు. దాదాపుగా ర‌హ‌స్య వివాహం జ‌రిగింద‌న్న‌మాట‌.

ఈ వివాహానికి మాత్రం కొద్దిమంది కుటుంబ సభ్యులు స్టార్ కపుల్స్ మాత్రమే హాజరయ్యారు.  రానా స్నేహితులు రామ్ చరణ్, కజిన్ నాగచైతన్య మాత్రం కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఇక త‌మ మొద‌టి వివాహ వార్షికోత్స‌వ రోజున మిహీకా ఇన్ స్టా వేదికగా రానా గురించి ఎంతో ప్రేమ‌గా రాసుకొచ్చింది. ఈ సంద‌ర్భంగా కొన్ని పెళ్లి నాటి ఫోటోల‌ను కూడా షేర్ చేసింది. దీంతో రానా అభిమానులు తెగ లైకులు కొట్టేస్తున్నారు.

``వార్షికోత్సవ శుభాకాంక్షలు నా ప్రియతమా! ఇది అత్యంత సంతోషకరమైన సంవత్సరం! ప్రపంచం అంత‌మ‌య్యే వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. మీరు నాకు అద్భుతమైన వాడిగా ఉన్నందుకు ధన్యవాదాలు !! ఇక్కడ ఇంకా జీవితకాలం ఉంది`` అంటూ ఆనందం వ్యక్తం చేశారు మిహీక. అంతేగాకుండా ఇది కౌంట్ డౌన్.. మై లైఫ్ మైలవ్ అనే హ్యాష్ ట్యాగ్ లను మిహీక జోడించారు.

ఇక రానా విష‌యానికి వ‌స్తే.. ఇటీవలే అమెరికా వెళ్లారని ప్రచారంలో ఉంది. ప్రస్తుతం అతడు సినిమా షూటింగ్‌ల‌లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు. రానా నటించిన విరాటపర్వం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. తదుపరి హిరణ్యకశిప సహా పలు భారీ చిత్రాల్లో రానా నటిస్తున్నారు. అంతేగాకుండా సంక్రాంతికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో రానా న‌టిస్తున్న భారీ కాంబో ముందుంది. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో రానా న‌టిస్తుండ‌టంతో ఈ సినిమా మ‌ల్టీస్టార‌ర్ మూవీగా మారింది. భారీ అంచ‌నాలే ఈ సినిమాపై ఉన్నాయి. మ‌రి ఈ సారి రానా ఎలాంటి మ్యాజిక్‌లు క్రియేట్ చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: