తెలుగు సినిమా పరిశ్రమ నిన్నటిదాకా ఎంతటి సంక్షోభంలో ఉంది అంటే సినిమాలను థియేటర్లలో విడుదల చేయాలా లేదా ఓ టీ టీ కి విడుదల చేయాలా అన్న సందిగ్ధంలో నిర్మాతలు ఉన్నారు. దానికి తోడు విడుదలైన మొదటి వారం సినిమాలకు కూడా ప్రేక్షకులను పెద్దగా రప్పించక పోవడంతో ఇక ఓ టీ టీ నే దిక్కు అనుకున్నారు కానీ రెండవ వారం విడుదలైన సినిమాలు కొంత వరకు ప్రేక్షకులను థియేటర్లో రప్పించగా ఇప్పుడు అందరూ నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
రెండవ వారం విడుదలైన సినిమాలలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా ప్రేక్షకులకు బాగా దగ్గరయి. వారిలో చలనం కలిగించింది. ఇప్పుడు మూడో వారం కూడా కొన్ని సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో వాటి పై భారీ అంచనాలను పెట్టుకున్నారు నిర్మాతలు. కొన్ని కొన్ని మంచి సినిమాలు విడుదలకు నోచుకోని సినిమా లు ఇప్పుడు థియేటర్లో విడుదల కావాలని చూస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమా గత కొన్ని రోజులుగా ఓటీటీ లో విడుదల కావాలని ప్రయత్నాలు చేస్తుండగా ఇప్పుడు ప్రేక్షకుల్లో ఉన్న పాజిటివ్ వైబ్స్ ను చూసి వారు మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేయాలనే ఆలోచన చేస్తున్నారట. మరోవైపు నాగచైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ సినిమా కూడా విడుదల వాయిదా పడడంతో ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని అక్కినేని అభిమానులు ఎదురు చూడసాగారు. కానీ ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన విడుదల కూడా థియేటర్లలో త్వరలో ప్రకటించనున్నారు అని తెలుస్తుంది. మరికొన్ని రోజులలో భారీ చిత్రాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈ గ్యాప్ ను సరిగా ఉపయోగించుకోవాలని చిన్న సినిమాలు ఆలోచన చేసి తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేసుకుంటున్నారు. సో ఓటీటీ కి వెళ్లాలనుకునే నిర్మాతలు ఇప్పుడు థియేటర్లకు మనసు మార్చుకోవడం టాలీవుడ్ కి కలిసివచ్చే పరిణామం.