కాక రేపుతున్న "మా" ఎన్నికల లేఖలు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న కృష్ణంరాజు...?
ఇదిలా ఉండగా ఈసారి మా ఎన్నికల్లో పోటీ చేసే మంచు విష్ణు, జీవితా, హేమ, ప్రకాశ్‌రాజ్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కమెడియన్, సహనటి హేమ హద్దులు దాటి మరీ ఆరోపణలు చేస్తూ అందరికీ రక్తం సలసల మరిగేలా చేస్తోంది. దీంతో ఆమెకు మా క్రమశిక్షణా సంఘం నుంచి షోకాజ్ నోటీసులు అందాయి. అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా ఆరోపణలు చేసిన హేమ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకోవాల్సి ఉందిగా క్రమశిక్షణా సంఘం ఆదేశించడం తో ఆమె సైలెంట్ అయిపోయింది.
నాన్-లోకల్ అయిన ప్రకాశ్‌రాజ్ మా అధ్యక్ష ఎన్నిక బరిలో దిగుతున్నారని ప్రకటించిన సమయం నుంచి అనేక ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. ఇక జీవితా రాజశేఖర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా ఎన్నికల బరిలోకి దిగడంతో ఈ సారి మా ఎన్నికలు చాలా ఉత్కంఠ భరితంగా మారాయి. అనూహ్యంగా మంచు విష్ణు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో భారీ పోటీ నెలకొంది.
ఇకపోతే తెలుగు కళాకారుల సంక్షేమం కోసం పని చేసే మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో ఆరేళ్ల క్రితం రాజేంద్రప్రసాద్ పోటీ చేసి గెలుపొందారు. ఆ సమయం నుంచి మా ఎలక్షన్లకు మంచి గుర్తింపు దక్కింది. టాలీవుడ్ అగ్ర నటీనటుల అందరూ కలిసి మా అసోసియేషన్ కి బీజం వేశారు.