కొత్త కమేడియన్స్ ని ఒక ఆట ఆడుకున్న పంచ్ ప్రసాద్.?
అయితే రెచ్చిపోదాం బ్రదర్ అనే కార్యక్రమంలో కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు కొత్త కమెడియన్స్ కి కూడా అవకాశాన్ని కల్పిస్తున్నారు ఈటీవీ నిర్వాహకులు. ఇక ప్రస్తుతం వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించి రెచ్చిపోదాం బ్రదర్ కార్యక్రమం ప్రోమో విడుదల అయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇక రెచ్చిపోదాం బ్రదర్ లో అటు జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కూడా తన కామెడీతో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ప్రోమోలో ఎంతో మంది కొత్త కమెడియన్స్ ని తన ఆటో పంచులతో ఒక ఆట ఆడుకున్నాడు పంచ్ ప్రసాద్.
కొంతమంది యువ కమెడియన్స్ స్కిట్ చేస్తున్న సమయంలో ఒక కమీడియన్ వచ్చి ఇగో అన్నా అని పిలుస్తాడు.. అరే నాకు ఇగో లేదురా నేను మంచోడినే అంటూ ఆటో పంచ్ వేస్తాడు పంచ్ ప్రసాద్.. నీకు ఇగో కాదన్నా ఇగో మా పోరడు అని కొత్త కమెడియన్ చెప్పగా.. అరే ఇగో కమెడియన్ అయితే వద్దు రా మనకి మంచి పోరడు కావాలి అంటూ మరో పంచ్ వేస్తాడు. అన్నా వాడు వడ్డించేవాడు అన్నా అని చెప్తే.. అవునా వడ్డీకి ఇస్తావా ఓ లక్ష రూపాయలు ఇవ్వు అంటూ మరో ఆటో పంచ్ వేస్తాడు. ఇలా వరుస పంచులతో యువ కమెడియన్స్ ని ఒక్క ఆట ఆడుకున్నాడు. దీంతో అక్కడున్న వారందరూ పగలబడి నవ్వుతున్నారు.