'గబ్బర్ సింగ్' కి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి ఏమైందో తెలుసా..?
ఇక అదే సమయంలో అంటే రెండు వరాల గ్యాప్ తో కొంచెం అటూ ఇటూ గా వచ్చిన మరికొన్ని సినిమాలను తట్టుకొని మరి తన సత్తా చాటింది గబ్బర్ సింగ్ సినిమా.ఈ సినిమాకి ముందు బోయపాటి దర్సకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దమ్ము మూవీ రిలీజ్ అయ్యింది.తారక్ నటన బాగున్నప్పటికి పెద్దగా సక్సెస్ ని అందుకోలేక పోయింది.అదే సమయంలో గబ్బర్ సింగ్ రిలీజ్ అవడంతో దమ్ము నెగిటివ్ లోకి వెళ్ళిపోయింది. 30 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ స్టెమిన ఏంటో చూపిచింది.ఇక గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన రెండు వరాల తరువాత మాస్ మహరాజ్ రవితేజ సినిమా దరువు రిలీజ్ అయింది.
శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యావరేజ్ తో మిగిలింది.ఈ మూవీ కి ఒక రోజు ముందే గురువారం ఆధ్యాత్మిక మూవీ రిలీజ్ అయింది.రామిరెడ్డి విలన్ క్యారెక్టర్ లొనే అదరగొడతాడు అనుకుంటే ఈ సినిమాలో సాయిబాబా పాత్రతో ప్రేక్షకులకు ఆశ్చర్యం లో ముంచెత్తాడు.సుమన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకి సరైనా ప్రమోషన్ రాలేదు. దానితో సినిమా ఎప్పుడూ వచ్చింది ఎప్పుడూ పోయిందో కుడా తెలిదు.ఇక జై హీరో గా తమిళ్ మూవీ కి తెలుగు వెర్షన్ లో వచ్చిన లవ్ జర్నీ సినిమాలో చేసాడు.ఆ సినిమా కూడా గబ్బర్ సింగ్ విడుదల సమయంలోనే వచ్చినా.. ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.మొత్తంగా ఆ సమయంలో విడుదలైన అన్ని సినిమాల మీద పై చేయి సాధించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్...!!