సిలికాన్ సిటీ డాన్ గర్ల్ ఫ్రెండ్‌గా పాయల్ రాజ్‌పుత్..?

Suma Kallamadi

అజయ్ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ పాయల్ రాజ్‌పుత్ కుర్రకారు మదిని ఇట్టే దోచేసింది. అయితే, ఆ తర్వాత కూడా పలు తెలుగు సినిమాల్లో నటించినా అవి అనుకున్నంత సక్సెస్ కాలేదు. పంజాబీ చిత్రాల్లోనూ నటించిన ఈ భామ ప్రస్తుతం కన్నడ భాషలో ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ ఆ చిత్రం ఏ నేపథ్యంలో రాబోతుంది? హీరో ఎవరు? పాయల్ రోల్ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే.

 
సాధారణంగా గ్లామరస్ రోల్స్‌తో హీరోయిన్స్ వేరే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, పాయల్ మాత్రం బయోపిక్ ద్వారా శాండల్‌వుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. బెంగళూరు సిటీకీ మాఫియాను ఇంట్రడ్యూస్ చేసిన మొట్ట మొదటి అండర్ వరల్డ్ డాన్ జయరాజ్ జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతున్నది. ఈ మూవీకి ‘హెడ్ బుష్’ టైటిల్ కన్ఫర్మ్ కాగా ఈ డాన్ కు గర్ల్ ఫ్రెండ్‌గా పాయల్ రాజ్‌పుత్ నటించబోతున్నది. డాన్‌గా జయరాజ్ ఒకప్పుడు సిలికాన్ సిటీనే గడగడలాడించినట్లు మేకర్స్ పేర్కొంటున్నారు. జయరాజ్ లైఫ్‌లోని ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్‌ను తీసుకుని సినిమాటిక్‌గా చిత్రం తీయబోతున్నట్లు తెలుస్తోంది. జయరాజ్ రోల్‌ను శాండల్ వుడ్ స్టార్ ధనుంజయ్ ప్లే చేయబోతున్నారు.

 భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శూన్య దర్శకత్వం వహిస్తున్నారు.జయరాజ్ జీవితంలోని ప్రతీ కోణం ఎగ్జైటింగ్ ప్లస్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని, అందుకే ఆయన జీవితగాధను సిల్వర్ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. జయరాజ్ గర్ల్ ఫ్రెండ్ రోల్ ప్లే చేసేందుకుగాను హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఏకంగా నిజమైన గర్ల్ ఫ్రెండ్ వద్దకే వెళ్లింది. ఆమె వద్ద ట్రైన్ అప్ కూడా అయినట్లు సమాచారం. అయితే, జయరాజ్ గర్ల్ ఫ్రెండ్ స్వస్థలం పంజాబ్ కాగా, ఈ పంజాబీ భామ పాయల్ సినిమాలో జయరాజ్ గర్ల్ ఫ్రెండ్‌గా నటిస్తుండటం విశేషమనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: