ఎప్పుడూ వివాదాల్లోనే ఈ నాయిక.. ?
ఈ విషయమై దుమారం చెలరేగింది. సిక్కు ఐదో గురువును చంపిన జాహంగీర్ పేరు ఎలా పెట్టారు? అంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇకపోతే కరీనా గర్భం దాల్చిన తర్వాత అనుభవించిన మధుర క్షణాలను బుక్ రూపంలో తీసుకొచ్చింది. ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పేరుతో పుస్తకాన్ని రచించగా, ఈ బుక్‌ను తన మూడో బిడ్డగా అభివర్ణించింది. అయితే, ఈ బుక్ టైటిల్ పైన కూడా వివాదమే చెలరేగింది. పవిత్ర బైబిల్‌ను పుస్తకం పేరులో కలిపి అపవిత్రం చేసిందంటూ క్రిస్టియన్స్ మండిపడ్డారు.
ఈ క్రమంలోనే కరీనాపై నెగెటివ్ కామెంట్స్ చేశారు. కరీనా కపూర్‌కు మెదడు లేదు, మతి చెడింది అని విమర్శలు చేశారు. మొత్తంగా బెబో ఎప్పుడూ వివాదాల్లోనే ఉండిపోతుందా? అని బీ టౌన్ వర్గాల్లో చర్చ జరుగుతుందట. ఇద్దరు బిడ్డల తల్లి అయిన కరీనా కపూర్ ఇలా వివాదాల్లో చిక్కుకోకుండా ఉండేందుకు తన హస్బెండ్ సైఫ్ అలీ ఖాన్ సలహాలు తీసుకుంటే మంచి దంటూ నెటిజన్లు కొందరు బెబోకు సూచిస్తున్నారు. ఇక సినిమాల పట్ల అత్యంత శ్రద్ధ వహించే కరీనా ఇన్ని వివాదాల్లో చిక్కుకోవడం ఆశ్చర్యంగా ఉందని బాలీవుడ్ సెలబ్రిటీలూ అనుకుంటున్నారట.