మోహన్ బాబు సినిమాలో చేశాకే.. నటించకూడదని నిర్ణయించుకున్న నటి..

Divya
తెలుగు ఇండస్ట్రీలో మోహన్ బాబు అంటే ఎంతో మంచి నటుడుగా గుర్తింపు ఉంది. ఇక ఆయన అప్పట్లో ఎన్నో సినిమాలలో నటించి , కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయనతో కలిసి ఒక సినిమాలో నటించిన నటి. ఈ సినిమాలో నటించి తర్వాత ఇక సినిమాల్లో నటించకూడదని అనుకున్నారట. ఆమె ఎవరు ..? ఎందుకు అలా అనుకుందో ..? ఒకసారి తెలుసుకుందాం.
తెలుగులో బేబీ వరలక్ష్మి అంటే.. ఇటు సీరియల్ లోను , అటు సినిమాలలోను బాగా గుర్తింపు తెచ్చుకున్నది. ఈమె భీమవరం ప్రాంతం నుంచి వచ్చినది. కేవలం పదో తరగతి చదువుతున్నప్పుడే సినిమా ఆఫర్లు రావడంతో ఉన్నత చదువుల కోసం ప్రయత్నించకుండా సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ఇక సినీ ఇండస్ట్రీలో ఉండే వాళ్లు సినీ రంగం లో ఉండే వారిని పెళ్లి చేసుకుంటూ ఉంటారు.

కానీ వరలక్ష్మి మాత్రం తమిళ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఈమెది భీమవరం అయినా  పుట్టింది పెరిగింది మాత్రం చెన్నైలోనేనట. అయితే ఇక అసలు విషయానికొస్తే , మోహన్ బాబు తో ఈమె నటించిన సినిమా చిట్టెమ్మ మొగుడు. అయితే ఈ సినిమాలో నటించిన వరలక్ష్మి తర్వాత ఎక్కువగా సినిమాలో కనిపించలేదు. ఈ చిట్టెమ్మ మొగుడు సినిమా లో వరలక్ష్మి ..హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో గర్భవతిగా నటించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే,  వరలక్ష్మి ఈ పాత్రని పోషించినప్పుడు ఆమె నిజంగానే గర్భం దాల్చడం గమనార్హం.
కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే, సినిమాలో ఒక సీను ప్రకారం వరలక్ష్మి అరటి తొక్క పై తను  కాలు వేసి కింద పడాలి. ఏకంగా 11 టేక్ లను తీసుకోవడం జరిగింది. కానీ ఎన్నిసార్లు చేసినా టేక్ సరిగ్గా రాకపోవడంతో ఆమె ఏడవడం మొదలు పెట్టిందట. ఆమె బాధను చూసిన దర్శకుడు ఏమైంది అని అడగగా, తను నిజంగానే గర్భవతి అని చెప్పడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇక అంతే కాదు ఆమె పై "ముందే చెప్పాలి కదా..! అని కోప్పడ్డారట. అయితే అప్పటికే తీసిన ఎన్నో షాట్ లలో ఒకటి తీసుకొని ఓకే చేస్తాను అని చెప్పి షూటింగ్ కి  ప్యాకప్ చెప్పేసారు ఆ దర్శకుడు. అందుకే బిడ్డ క్షేమాన్ని ఆమె దృష్టిలో పెట్టుకుని సినిమాలకు దూరంగా వుంది.
ఆ తర్వాత ఎన్నో సీరియల్స్ లో నటించి ,తన కంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి.
MOHA

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: