అల్లు అర్జున్ పై..మనసులో మాట చెప్పిన ప్రియాంక జవాల్కర్..!

Divya
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే.. ఎంతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మొదటి సినిమాకి ప్రస్తుతం సినిమాలకు చూస్తే చాలా మారిపోయాడు అల్లు అర్జున్. ఇక తనను తానే మార్చుకోవడానికి ఆర్య మూవీ నే కారణమని కొన్ని సందర్భాలలో తెలిపారు. అయితే ఈ మధ్యకాలంలో ఈయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ అయింది. ఇలాంటి వారిలో మన హీరోయిన్ కూడా ఒకరు. ఆమె ఎవరో కాదు ప్రియాంక జవాల్కర్.


ఈమె విజయ్ దేవరకొండ తో కలిసి టాక్సీవాలా సినిమాలో నటించి, ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక ఆ తర్వాత ఏ సినిమాలో కూడా అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఇక తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా బాగా పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇదంతా ఇలా ఉంటే అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది.

ప్రియాంక జవాల్కర్ మొదటిసారిగా గా 2017లో "కలవరమాయే"అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకీ వచ్చింది. ఆతర్వాత టాక్సీవాలా వంటి సినిమాల్లో నటించినా ఈమెకు , ఆ సినిమాలో నటించిన ఎక్కువ  క్రేజీ హీరో విజయ్ కే వెళ్ళిపోయింది. ఈ మధ్య కాలంలోనే తిమ్మరుసు అనే సినిమాలో కూడా నటించింది ఈ భామ. అది కూడా మంచి సక్సెస్ గా అందుకుంది.


ఇక తాజాగా కూడా"S.R. కళ్యాణమండపం" లో కూడా నటించింది.ఈ సినిమా కూడా భారీ సక్సెస్ అందుకోవడంతో కొన్ని విషయాలను అభిమానులతో చెప్పుకొచ్చింది ఈమె. తను మేకప్ వేయడం వల్లే అందంగా కనిపిస్తున్నట్లు తెలిపింది. ఇక అంతే కాకుండా ఒకనొక సమయంలో తన అందం మీద కూడా ఎంతోమంది కామెంట్ చేశారు అని తెలిపింది. సన్నబడాలని ఉద్దేశంతో ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది.

అంతే కాకుండా ఈ మధ్య కాలంలోనే థైరాయిడ్  వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. అందుకోసమే తన ముఖం మీద మార్పులు, శరీరం మీద మార్పులు వచ్చాయి అని చెప్పుకొచ్చింది. అందుకోసమే ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు కూడా చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: